రివ్యూ – ఆపరేషన్ రావణ్

రివ్యూ – ఆపరేషన్ రావణ్

నటీనటులు – నటీనటులు: రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితరులు

సాంకేతిక బృందం – సంగీతం: శరవణ వాసుదేవన్, డైలాగ్స్: లక్ష్మీ లోహిత్ పూజారి, ఎడిటర్: సత్య గిద్దుటూరి, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, నిర్మాత: ధ్యాన్ అట్లూరి, రచన-దర్శకత్వం: వెంకట సత్య

పలాస, నరకాసుర వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. “ఆపరేషన్ రావణ్” సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథేంటంటే

టీవీ 45 ఛానెల్ లో రిపోర్టర్ గా పనిచేస్తుంటుంది ఆమని (సంగీర్తన విపిన్). మినిస్టర్ తమ్మినేని జోగారావ్ (రఘు కుంచె) అక్రమాలు బయపెట్టే స్టోరీ చేసే పనిలో ఉండగా సీఈవో (టీవీ5 మూర్తి) ఆమెను ఆ అసైన్ మెంట్ నుంచి తప్పించి క్రైమ్ స్టోరీ అప్పగిస్తాడు. సిటిలో ఓ సైకో వరుస హత్యలు చేస్తుంటాడు. అతని చేతిలో రాజి, మానస, అనిత, బిందు, శిరీష, ప్రదీప్పిత, లావణ్య ఇలా అమ్మాయిలను చనిపోతుంటారు. ఈ హత్యలు చేస్తున్నది ఎవరు అనే ఇన్వెస్టిగేషన్ పోలీసులు ఒకవైపు ఆమని మరోవైపు చేస్తుంటారు. ఆమనికి అసిస్టెంట్ రిపోర్ట్ గా జాయిన్ అవుతాడు రామ్ (రక్షిత్ శెట్టి). సైకోను వెతికే క్రమంలో ఆమని కూడా అపహరణకు గురవుతుంది. ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు. అతన్ని పోలీసులు, రామ్ ఎలా పట్టుకున్నారు. రామ్ ఆమనిని దక్కించుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ.

ఫ్లస్ పాయింట్స్

కథ, కథనం, దర్శకత్వం

హీరో రక్షిత్ పర్ ఫార్మెన్స్

టెక్నికల్ బ్రిలియెన్స్

ఎలా ఉందంటే

ఓ సరికొత్త సైకో థ్రిల్లర్ ను తెరపై ఆవిష్కరించింది ఆపరేషన్ రావణ్ సినిమా. ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించారు దర్శకుడు వెంకట సత్య. ఫ్రేమ్స్ పెట్టడం దగ్గర నుంచి టేకింగ్, ఆర్టిస్టుల దగ్గర పర్ ఫార్మెన్స్ తీసుకోవడం దాకా..ఆయన కొత్త డైరెక్టర్ అని ఎక్కడా అనిపించదు. రామ్, ఆమని లవ్ స్టోరీతో మెల్లిగా కథను ప్రారంభించిన దర్శకుడు మరోవైపు సైకో హత్యలతో సీరియస్ నెస్ తీసుకొచ్చాడు. ఈ సైకో ఎవరు ఎందుకు హత్యలు చేస్తున్నాడనేది సెకండాఫ్ లో ఆకట్టుకునేలా చూపించాడు. ఆ పాయింట్ కు సరైన జస్టఫికేషన్ ఇచ్చాడు. మనలో మంచీ చెడూ రెండూ ఉంటాయని, మంచిని చెడు డామినేట్ చేసినప్పుడే సైకో తయారవుతాడని చెప్పిన పాయింట్ బాగుంది.

ఆర్టిస్టుల పరంగా చూస్తే రక్షిత్ మరింత మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు. రామ్ పాత్రలో అతని ఎనర్జీ, ఎమోషన్ రెండూ బాగున్నాయి. ఆయన గత చిత్రాలతో చూస్తే స్టైలిష్ గా కనిపించాడు. హీరోయిన్ సంగీర్తన విపిన్ మంచి పర్ ఫార్మెన్స్ ఇచ్చింది. చాలా న్యాచురల్ గా కనిపించింది. టీవీ రిపోర్టర్ గా ఆకట్టుకుంది. రాధిక పాత్ర ఆమె కెరీర్ లో గుర్తుండిపోతుంది. ఈ మధ్య కాలంలో ఆమె ఇలాంటి ఎమోషనల్, జెన్యూన్ రోల్ లో నటించలేదు. రఘు కుంచె చేసిన మినిస్టర్ క్యారెక్టర్ చిన్నదైనా ఇంపాక్ట్ ఉంది. సైకో క్యారెక్టర్ కూడా గుర్తుండిపోయేలా ఉంది.

లిరిసిస్ట్ పూర్ణాచారి, ప్రణవం, డైలాగ్స్ రాసిన లోహిత్ వీళ్లంతా చిన్న చిన్న పాత్రల్లో మెరిశారు. శరవణ వాసుదేవన్ సంగీతం, లక్ష్మీ లోహిత్ పూజారి డైలాగ్స్, సత్య గిద్దుటూరి ఎడిటింగ్, నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ టెక్నికల్ గా సినిమాను స్ట్రాంగ్ గా మార్చాయి. ఇవాళ్టి సమాజంలో జరుగుతున్న ఘటనలకు అద్దం పట్టేలా ఉన్న ఆపరేషన్ రావణ్ ఈ వీక్ ఆడియెన్స్ చూసేందుకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

రేటింగ్ 3/5