నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ ఆయన కొత్త సినిమా నా సామి రంగ టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. నాగార్జున నటిస్తున్న 99వ చిత్రమిది. నాగార్జునను మాస్ యాక్షన్ తో చూపించిన నా సామి రంగ మూవీ గ్లింప్స్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
డెన్ లో రౌడీలు మీటింగ్ లో ఉంటారు వాళ్లందరూ పులులని అనుకుంటారు కానీ మేకలని తెలియదు. వాళ్ల గుంపులోనే పులి లాంటి హీరో దాగి ఉంటుంది. ఎవడన్నా ఆడు అని విలన్స్ అడగగానే ఆ రౌడీలకు బాస్ హీరో పేరు చెబుతాడు. పక్కన కింగ్ ఫిషర్ బీర్ లోని కింగ్ టైటిల్ కనిపిస్తుంది. ఆ పేరు వినగానే రౌడీలంతా షాక్ పోయి, భయంతో వణికిపోతారు. తర్వాత ఒక్కొక్కరుగా డెన్ నుంచి దెబ్బలు తిని బయటపడతారు. అప్పుడు బయటకొచ్చిన హీరో నాగార్జున….ఈ పండక్కి నా సామి రంగ అంటూ పవర్ ఫుల్ గా డైలాగ్ చెబుతాడు. ఈ డైలాగ్ తో గ్లింప్స్ పూర్తవుతుంది.
ఈ గ్లింప్స్ లో పలాస దర్శకుడు కరుణ కుమార్ రౌడీ బాస్ క్యారెక్టర్ లో చూపించారు. పగిలిన బల్బ్ ఫిలమెంట్ తో నాగార్జున బీడీ అంటించుకోవడం గ్లింప్స్ కు హైలైట్. ఫుల్ మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇలాంటి మాస్ రగ్డ్ క్యారెక్టర్ లో నాగార్జున ఇప్పటిదాకా కనిపించలేదు. ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ పేరు అఖిల్ గా తెలుస్తోంది.