రివ్యూ – “మ్యాడ్” టీజర్

ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న సినిమా మ్యాడ్. ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత్ శోభన్, శ్రీ గౌరి ప్రియ, రామ్ నితిన్ ఇతర కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. కాలేజ్ డేస్ స్టోరితో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఆ టీజర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

ఎవరి లైఫ్ లో అయినా కాలేజ్ డేస్ స్పెషల్. ఆ కాలేజ్ డేస్ ను గుర్తు చేస్తూ తెరకెక్కిన మూవీ మ్యాడ్. ఇందులో రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజ్ నేపథ్యంగా కథ సాగింది. కాలేజ్ డేస్ లో సీనియర్స్, జూనియర్స్ ను చేసే ర్యాగింగ్, చదువుల మీద నిర్లక్ష్యం, గ్యాంగ్ ల మెయింటేన్ చేయడం, కాలేజ్ గోడల మీద కూర్చుని మందు కొట్టడం వంటి పనులన్నీ చూపించారు. ఇలాంటి పిల్లలతో పేరెంట్స్ పడే కష్టాలు టీజర్ లో ఉన్నాయి. కొన్ని మ్యాడ్ పనులు, డైలాగ్స్ కూడా ఈ టీజర్ లో వినిపించాయి. ఈ కథకు తగినట్లే బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ అప్పటి హ్యాపీ డేస్ ను గుర్తు చేసింది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.