రివ్యూ – లవ్ రెడ్డి

నటీనటులు – అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, జ్యోతి, తిలక్, గణేష్, తదితరులు

టెక్నికల్ టీమ్ – సంగీతం – ప్రిన్స్ హేన్రి, ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు- సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి, రచన, దర్శకత్వం: స్మరన్ రెడ్డి

జీవితంలో ప్రేమలో ఒక్కసారైనా పడని వారుండరు. అందుకే లవ్ స్టోరీస్ ప్రేక్షకుల ఎమోషన్ కు త్వరగా కనెక్ట్ అవుతాయి. ఆ కథలో నిజాయితీ ఉంటే చాలు ఆదరణ పొందుతాయి. ఇలాంటి జెన్యూన్ లవ్ స్టోరీగా రిలీజ్ కు వచ్చింది “లవ్ రెడ్డి”. సినిమా సక్సెస్ పై మూవీ టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడారు. మరి వారి మాటలు నిజమయ్యాయా లేదా రివ్యూలో చూద్దాం.

కథేంటంటే

గార్మెంట్ బిజినెస్ చేసే నారాయణరెడ్డి (అంజన్ రామచంద్ర) ఒక పెల్లి కాను ప్రసాద్. అతనిది ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లోని ఓ అందమైన గ్రామం. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా నారాయణరెడ్డికి ఆ అమ్మాయిలెవరూ నచ్చరు. ఏ అమ్మాయినీ ఇష్టపడని నారాయణరెడ్డి దివ్య (శ్రావణి)ని చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడు. ప్రాణం కన్నా ఎక్కువగా దివ్యను ప్రేమించిన నారాయణ రెడ్డి ఆమెకు ఈ విషయం చెప్పకుండా మనసులోనే దాచుకుంటాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహంగానే ఉంటుంది. ఆమె తనను ప్రేమిస్తుందని అనుకుంటాడు నారాయణరెడ్డి. దివ్యకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి ఆమెకు తన ప్రేమ విషయం వెల్లడిస్తాడు. అప్పటిదాకా స్నేహంగా ఉన్న దివ్య నారాయణ రెడ్డి లవ్ ప్రపోజల్ తిరస్కరిస్తుంది. ఆమె ఎందుకు లవ్ రిజెక్ట్ చేసింది. దివ్య తీసుకున్న నిర్ణయం వెనక కారణాలు ఏంటి, నారాయణరెడ్డి, దివ్య ప్రేమకథ చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది అనేది తెరపై చూడాల్సిన కథ.

ఎలా ఉందంటే

మీరు లవ్ రెడ్డి సినిమా చూసేందుకు థియేటర్స్ కు రండి..థియేటర్ లో కూర్చున్న తర్వాత మా సినిమానే మిమ్మల్ని తీసుకెళ్తుంది అని హీరోయిన్ శ్రావణి ప్రి రిలీజ్ ‌ఈవెంట్ లో చెప్పిన మాటలు లవ్ రెడ్డి సినిమా చూస్తున్నప్పుడు నిజమేననిపిస్తాయి. హీరో పెళ్లి చూపులతో సరదా సీన్స్ తో లవ్ రెడ్డి మూవీ ప్రారంభమవుతుంది. దివ్యను చూసి ప్రేమలో పడటం, వారి స్నేహంతో ప్లెజెంట్ గా సాగుతుంది. ఇంటర్వెల్ టైమ్ కు కథ ఒక మంచి ఎమోషన్ కు రీచ్ అవుతుంది. దివ్య నారాయణరెడ్డిని ఎందుకు రిజెక్ట్ చేసిందనే విషయం రివీల్ కాగానే కథ పూర్తిగా ఎమోషనల్ గా మారిపోతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి దాదాపు అరగంట లవ్ రెడ్డి మూవీ చూపు తిప్పుకోనివ్వదు. ప్రేక్షకుడి ఊహకు అందకుండా కథ సాగుతుంది. ఆద్యంతం ఇలా సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించిన క్రెడిట్ దర్శకుడు స్మరణ్ రెడ్డికే దక్కుతుంది. ఆయన అనుభవం ఉన్న దర్శకుడిలా కథను డీల్ చేశాడు. స్మరణ్ రెడ్డి ప్రతిభ లవ్ రెడ్డితో టాలీవుడ్ కు తెలుస్తుంది.

ఆర్టిస్టుల పరంగా హీరో అంజన్ రామచంద్ర, హీరోయిన్ శ్రావణి లవ్ రెడ్డి మూవీకి తమ పర్ ఫార్మెన్స్ లతో ప్రాణం పోశారు. ఒక అబ్బాయి ఎంతగా ప్రేమిస్తాడో తన నటనతో ఎమోషన్ తో అంజన్ చూపిస్తే, ప్రతి అమ్మాయి రిలేట్ అయ్యేలా శ్రావణి నటించింది. సినిమా చూశాక ఆమె తప్ప దివ్య క్యారెక్టర్ కు మరో అమ్మాయిని ఊహించుకోలేం. అంజన్ రామచంద్ర, శ్రావణికి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. జ్యోతి, తిలక్, గణేష్ వంటి కాస్టింగ్ కొత్త వాళ్లైనా తమ పాత్రల్లో మెప్పించారు. టెక్నికల్ అంశాలో మ్యూజిక్ హైలైట్ అయ్యింది. ప్రిన్స్ హెన్రీ చేసిన పాటల్లో ప్రాణం కన్నా ఎమోషనల్ గా ఉండి ఆకట్టుకుంది. అలాగే బీజీఎం కథలోని ఫీల్ ను రెట్టింపు చేసింది. మొత్తంగా ఒక మంచి ఎమోషనల్ లవ్ స్టోరీగా లవ్ రెడ్డి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.

రేటింగ్ 3/5