నటీనటులు – విజయ్ ఆంటోనీ, మృణాళిని రవి, వీటీవీ గణేష్, తలైవాసల్ విజయ్, ఇళవరసు, సుధ, శ్రీజ రవి తదితరులు
టెక్నికల్ టీమ్ – సినిమాటోగ్రఫీ – ఫరూక్ జే బాష, సంగీతం -భరత్ ధనశేఖర్, ఎడిటింగ్, నిర్మాత – విజయ్ ఆంటోనీ, సమర్పణ – మీరా విజయ్ ఆంటోనీ, రచన దర్శకత్వం – వినాయక్ వైద్యనాథన్
విజయ్ ఆంటోనీ అంటే డాక్టర్ సలీమ్, సైతాన్, బిచ్చగాడు వంటి వెరైటీ సినిమాలు గుర్తొస్తాయి. ఆయన కెరీర్ లో ఫస్ట్ టైమ్ నటించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ గురు”. రంజాన్ పండుగ సందర్భంగా ఇవాళ ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. మృణాలిళిని రవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేసిన “లవ్ గురు” ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
మలేసియాలో కేఫ్ నడుపుతుంటాడు అరవింద్ (విజయ్ ఆంటోనీ). దీని ద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసే ప్రయత్నం చేస్తాడు. ఈ బిజినెస్ లో పడి పర్సనల్ లైఫ్ ను పట్టించుకోడు అరవింద్. ప్రేమ,పెళ్లి లాంటి విషయాలు ఆలోచించే టైమ్ అతనికి ఉండదు. పైగా తన సోదరి గురించిన ఓ చేదు గతం అతన్ని వెంటాడుతుంటుంది. ఇండియా తిరిగొచ్చిన అరవింద్ బంధువుల ఇంట్లో లీల అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. లీల తల్లిదండ్రులు కూడా అరవింద్ ఇష్టాన్ని గ్రహించి పెళ్లి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అరవింద్ లీల పెళ్లి జరుగుతుంది. పెళ్లయ్యాక తనంటే లీలకు ఇష్టం లేదని అరవింద్ తెలుసుకుంటాడు. తన ప్రేమతో భార్య మనసు మార్చాలని ప్రయత్నాలు మొదలుపెడతాడు. లీలకు భర్తంటే ఎందుకు ఇష్టం లేదు. లైఫ్ లో ఆమెకున్న గోల్స్ ఏంటి, భార్య అనుకున్నది సాధించేందుకు భర్తగా అరవింద్ ఏం చేశాడు, భార్య లీల మనసు మార్చగలిగాడా లేదా, చెల్లి విషయంలో తాను బాధపడుతున్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనే విషయాలు తెరపై చూడాలి.
ఎలా ఉందంటే
పెళ్లయ్యాక మహిళ తమ జీవిత లక్ష్యాలను వదులుకోవాల్సిన పనిలేదని, అందుకు భర్త సహకరించాలనే మంచి సందేశాన్ని కథలో అంతర్లీనంగా చూపించిన సినిమా లవ్ గురు. ఈ సినిమా చూశాక మీ జీవిత భాగస్వామిని ప్రేమించడం తెలుసుకుంటారు అని ప్రచారంలో చిత్ర హీరో విజయ్ ఆంటోనీ చెప్పినట్లే లవ్ గురు భార్య మనసును అర్థం చేసుకునేలా చేస్తుంది. భార్య లీలకు సినిమా హీరోయిన్ కావాలనే కోరిక. ఆమెకు పెళ్లి ఇష్టం లేదు. భర్తను ద్వేషిస్తుంది. అయితే ఆమెను తన ప్రేమతోనే గెలవాలని పట్టుదలగా ప్రయత్నిస్తుంటాడు అరవింద్. చివరకు ఆమెను హీరోయిన్ చేసేందుకు తనే ప్రొడ్యూసర్ గా మారుతాడు. ప్రథమార్థంలో వచ్చే ఈ సన్నివేశాలన్నీ అటు ఎంటర్ టైనింగ్ గా ఇటు ఎమోషనల్ గా సాగుతూ ఆకట్టుకుంటాయి. ద్వితీయార్థంలో ఈ ఎమోషన్ మరింత బలంగా మారుతుంది. చెల్లి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉద్వేగంగా సాగుతాయి. సినిమా చివరలో హీరో హీరోయిన్స్ కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. వీటీవీ గణేష్, యోగి బాబు తమ కామెడీతో లవ్ గురులోని ఎమోషన్ ను బ్యాలెన్స్ చేశారు. వీళ్లతో హీరో కాంబినేషన్ సీన్స్ నవ్విస్తాయి.
దర్శకుడు వినాయక్ కు ఇది మొదటి సినిమా అయినా ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో మెప్పించాడు. హీరో హీరోయిన్ల తో పాటు కథలోని ప్రతి క్యారెక్టర్ కు పర్పస్ ఉండేలా చూసుకున్నాడు. విజయ్ ఆంటోనీ ఇన్నోసెంట్ హజ్బెండ్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు. ఇప్పటిదాకా ఆయన చేసిన సినిమాలకు, క్యారెక్టర్స్ కు పూర్తి భిన్నమైన సినిమా ఇది. విజయ్ ఆంటోనీ కెరీర్ లో ఒక స్పెషల్ మూవీగా లవ్ గురు నిలుస్తుంది. మృణాలిని రవి లీలా క్యారెక్టర్ కు కావాల్సిన టెంపర్ మెంట్ చూపించింది. ఆమె నటనకు మంచి పేరొస్తుంది. టెక్నికల్ గా భరత్ మ్యూజిక్ ఆకర్షణగా నిలుస్తుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వంటి అంశాల్లో హై క్వాలిటీ కనిపించింది. లవ్ గురు సినిమా విజయ్ ఆంటోనీతో పాటు మొత్తం టీమ్ కు మంచి సక్సెస్ ఇస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ వీక్ ఫ్యామిలీతో కలిసి ఈ సినిమాను ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు.
రేటింగ్ 3.5/5