గత దీపావళికి “క” సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు తన కొత్త సినిమా “దిల్ రూబా”తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన గత చిత్రాలకు భిన్నంగా కాలేజ్ బేస్డ్ ఫ్రెష్ లవ్ స్టోరీతో ఈ సినిమా చేశారు కిరణ్ అబ్బవరం. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. “దిల్ రూబా” సినిమా ఫిబ్రవరిలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
“దిల్ రూబా” సినిమా టీజర్ ఎలా ఉందో చూస్తే – హీరో సిద్ధార్థ్ (కిరణ్ అబ్బవరం) తన లవ్ స్టోరీని చెబుతుండగా టీజర్ మొదలైంది. మార్చిలో ఎగ్జామ్స్ ఫెయిలైనట్లు మ్యాగీతో లవ్ లో ఫెయిలవుతాడు సిద్ధార్థ్. ఆ తర్వాత కింగ్, జాన్ అనే ఇద్దరు మిత్రులు ఇచ్చిన కౌన్సెలింగ్ తో ఇక ప్రేమించకూడదని నిర్ణయించుకుంటాడు. మార్చి తర్వాత సెప్టెంబర్ వచ్చినట్లు సిద్ధార్థ్ జీవితంలోకి అంజలి(రుక్సర్ థిల్లాన్) వస్తుంది. అంజలితో ప్రేమ హ్యాపీగా సాగుతున్న టైమ్ లో అనుకోని ఘర్షణలు ఎదురవుతాయి. ఈ అడ్డంకులను సిద్ధార్థ్ ధైర్యంగా ఎదుర్కొంటాడు. ప్రేమ చాలా గొప్పది, కానీ అది ఇచ్చే బాధే భయంకరంగా ఉంటుంది అనే ఎమోషనల్ డైలాగ్ తో టీజర్ ఆసక్తికరంగా కంప్లీట్ అవుతుంది. టీజర్ లో సిద్ధార్థ్ గా కిరణ్ అబ్బవరం ఫ్రెష్ లుక్, యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ గా నిలిచాయి. అలలుగా తాకగానే కరిగిపోనా నీలో..అనే పాటతో సామ్ సీఎస్ చేసిన బీజీఎం ఆకట్టుకుంది.