నటీనటులు – సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్, సత్యం రాజేశ్, ప్రభాకర్, వినయ్ వర్మ, సోనియా ఆకుల, స్నేహమాధురి శర్మ, తదితరులు
టెక్నికల్ టీమ్ – ఎడిటర్ – ఆర్ఎం విశ్వనాథ్ కుచనపల్లి, సినిమాటోగ్రఫీ – చందూ ఏజే, మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి, ప్రొడ్యూసర్ – జేమ్స్ వాట్ కొమ్ము, స్టోరీ, డైరెక్షన్ – రతన్ రిషి
ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా. ఈ చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్త తరహా రొమాంటిక్ థ్రిల్లర్ గా సినిమా ఉంటుందనే ఎక్స్ పెక్టేషన్స్ మూవీ లవర్స్ లో ఏర్పడ్డాయి. ఈ రోజు రిలీజ్ కు వచ్చిన కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా థియేటర్స్ ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
విక్కీ (సంతోష్ కల్వచెర్ల), జాను (క్రిషేక పటేల్) ఒకరినొకరు ఇష్టపడతారు. వీరి లవ్ స్టోరీ హ్యాపీగా సాగుతుంటుంది. తాము ప్రేమించుకున్న విషయాన్ని తల్లిదండ్రులకు చెబితే వారు ఒప్పుకోరు. ఇంతలో విక్కీ చెల్లి స్వాతి (స్నేహ మాధురి) రేప్ అండ్ మర్డర్ కు గురవుతుంది. చెల్లి హత్యాచారాన్ని తట్టుకోలేకపోతాడు విక్కీ. మానసికంగా కుంగిపోయిన విక్కీని ఈ బాధ నుంచి బయటకు తీసురావాలని, ఎప్పటిలా తనను సంతోషంగా చూడాలని ప్రయత్నిస్తుంటుంది జాను. మరోవైపు హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సైకో రవి (కాలకేయ ప్రభాకర్) పోలీసుల అదుపులోనుంచి తప్పించుకుంటాడు. అతని కోసం పోలీసులు వేట సాగిస్తుంటారు. ఈ సైకో రవి జాను ఇంట్లో జరుగుతున్న బర్త్ డే పార్టీలోకి వెళ్తాడు. అక్కడ సైకో రవి చేసిన క్రైమ్స్ ఏంటి, అతని లైఫ్ కు ఎలాంటి ముగింపు ఎదురైంది, తన చెల్లిని చంపిన వారిపై హీరో విక్కీ ఎలా పగతీర్చుకున్నాడు, విక్కీ జాను చివరకు ఎలా ఒక్కటయ్యారు అనేది తెరపై చూడాల్సిన కథ
ఎలా ఉందంటే
సైకో థ్రిల్లర్స్, రొమాంటిక్ థ్రిల్లర్స్ మనం చూసి ఉంటాం. కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా ఈ రెండు జానర్స్ కలిపిన అంశాలతో ప్రేక్షకులకు ఒక కొత్త ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. సైకో క్యారెక్టర్ కలిపిన ఒక యూనిక్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ఇదని చెప్పుకోవచ్చు. లవ్ స్టోరీ, క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కిల్లర్ ఆర్టిస్ట్ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించాడు దర్శకుడు రతన్ రిషి. అందరికీ కనెక్ట్ అయ్యే కథకు డిఫరెంట్ స్క్రీన్ ప్లే రాసి ప్రతి సీన్ క్యూరియస్ గా ఉండేలా తెరకెక్కించాడు దర్శకుడు రతన్ రిషి. ఫిలిం మేకర్ గా తన మెటల్ ప్రూవ్ చేసుకున్నాడు.
విక్కీ, జాను లవ్ స్టోరీ సరదాగా సాగితే, స్వాతి రేప్ అండ్ మర్డర్ ఎలిమెంట్ కథలో సీరియస్ నెస్ తీసుకొస్తుంది. సైకో రవి క్యారెక్టర్ ఎంట్రీతో ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలవుతుంది. స్వాతిని చంపింది ఎవరు, సైకో రవి జాను ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేశాడనే ప్రశ్నలకు సమాధానాలను ఒక్కో సీన్ ద్వారా రివీల్ చేస్తూ ప్రీ క్లైమాక్స్ లో ఒక సూపర్బ్ ట్విస్ట్ తో కథ మలుపు తిరుగుతుంది. జాను ఫ్యామిలీ ఎందుకు విడిపోయింది, జాను తల్లి వీళ్ల ప్రేమకు ఎందుకు అడ్డుచెప్పిందనే అంశాలు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. మొత్తంగా థ్రిల్లర్స్ లో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే ఫీల్ ను కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ కలిగిస్తుంది.
విక్కీ పాత్రలో సంతోష్ కల్వచెర్ల ఆల్ రౌండ్ పర్ ఫార్మెన్స్ చేశాడు. లవర్ గా, చెల్లితో ఎమోషనల్ బాండింగ్ ఉన్న బ్రదర్ గా, రివేంజ్ టైమ్ లో ఇంటెన్స్ గా కనిపించాడు సంతోష్. అతని యాక్టింగ్ టాలెంట్ కు కిల్లర్ ఆర్టిస్ట్ మూవీ ఒక రిఫరెన్స్ గా చెప్పుకోవచ్చు. జాను పాత్రలో క్రిషేక అందంగా కనిపించడం తో పాటు క్యారెక్టర్ కు తగినట్లు బాగా నటించింది. స్వాతి పాత్రలో స్నేహమాధురి శర్మ, పోలీస్ ఆఫీసర్ గా సత్యం రాజేశ్ తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకున్నారు. సైకో రవి కాలకేయ ప్రభాకర్ కెరీర్ లో చేసిన ఒక ప్రత్యేకమైన పాత్రగా మిగిలిపోతుంది. ఈ పాత్రలో ఇంటెన్స్ గా భయపెట్టేలా నటించాడు కాలకేయ ప్రభాకర్.
టెక్నికల్ గా చూస్తే సురేష్ బొబ్బిలి ఇచ్చిన బీజీఎం మెయిన్ హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమాకు తన బీజీఎంతో లైఫ్ ఇచ్చాడని నిర్మాత జేమ్స్ వాట్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో చెప్పింది నిజమేనని మూవీ చూస్తున్నవారికి తెలుస్తుంది. చందూ సినిమాటోగ్రఫీ ఈ థ్రిల్లర్ ను విజువల్ గా మరింత ఎఫెక్టివ్ గా చూపించింది. నిర్మాత జేమ్స్ వాట్ కొమ్ము మూవీని అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మించారు. ఓ డిఫరెంట్ థ్రిల్లర్ చూడాలనుకునే మూవీ లవర్స్ కు కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా ఈ వీక్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు
రేటింగ్ 3/5