నటీనటులు – వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి, అరవింద్ ముదిగొండ, నోమిన తార , తదితరులు
టెక్నికల్ టీమ్ – డీవోపీ – వినీత్ పబ్బతి, ఎడిటర్ – రా యోగేష్, మ్యూజిక్ డైరెక్టర్ – గుడప్పన్, ప్రొడ్యూసర్ – మరే శివశంకర్, రచన దర్శకత్వం – సింగార మోహన్
ప్రస్తుతం భారీ యాక్షన్, రా అండ్ రస్టిక్ మూవీస్ ఎక్కువగా తెరపైకి వస్తున్నాయి. మంచి ప్లెజెంట్ లవ్ స్టోరీస్ తగ్గిపోయాయి. ఇలాంటి టైమ్ లో అచ్చ తెలుగు స్వచ్ఛమైన ప్రేమ కథగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాలమేగా కరిగింది సినిమా. సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించిన ఈ పొయెటిక్ లవ్ స్టోరీ థియేటర్స్ లో ఎంతగా మెప్పించిందో ట్రైలర్ లో చూద్దాం.
కథేంటంటే
మనం ఎంతగా ఎదిగినా, ఎక్కడున్నా, ఏం చేసినా తొలి ప్రేమను మర్చిపోలేం. ఆ ఫస్ట్ లవ్ ఫీల్ ఇంకేదీ అందించలేదు. అలాంటి తన తొలి ప్రేమను వెతుక్కుంటూ ఓ యువకుడు చేసిన ప్రయాణమే ఈ మూవీ మూల కథ. జీవితంలో సక్సెస్ అయిన ఫణి ( అరవింద్ ముదిగొండ, వినయ్ కుమార్) తను చిన్నప్పుడు ప్రేమించిన బిందు(నోమిన తార, శ్రావణి మజ్జరి)ని వెతుక్కుంటూ సొంతూరికి వెళ్తాడు. ఫణి, బిందు స్కూల్ డేస్ నుంచి ప్రేమలో ఉంటారు. టీనేజ్ ప్రేమను ఆస్వాదిస్తారు. చదువుల్లో టాపర్ కాలేకపోయిన కారణంతో బిందుకు కొంతకాలం దూరంగా ఉండాలనుకుంటాడు ఫణి. ఈ గ్యాప్ వారిని మరింత దూరం చేస్తుంది. అలా దూరమైన బిందును చాలాకాలం తర్వాత కలుసుకోవాలని ఊరికి వెళ్తాడు ఫణి. బిందును తను కలుసుకోగలిగాడా, బిందు ఎక్కడుంది, ఎలా ఉంది తెలుసుకున్నాడా లేదా, ప్రేమలో వీరు మళ్లీ ఒక్కటయ్యారా లేదా అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
తెలుగులో వచ్చిన మోస్ట్ పొయెటిక్ ఫిల్మ్ ఇది అని చెప్పగలను అంటూ ప్రమోషన్ ఈవెంట్స్ లో దర్శకుడు సింగార మోహన్ చెప్పాడు. సినిమా చూస్తున్న ఆడియెన్స్ కు అతను చెప్పిన మాటలు హైప్ కోసం కాదని నిజమేనని అనిపిస్తుంది. కలహాలే లేని ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఫ్రేమ్ ప్రతి క్యారెక్టర్ ప్రతి సందర్భం పొయెటిక్ గా తీర్చిదిద్దాడు దర్శకుడు. స్కూల్ డేస్ ప్రేమలో ఫణి, బిందు చేసిన జర్నీని, వారు ఫీల్ అయిన ఎమోషన్ ను ప్లెజెంట్ గా స్క్రీన్ మీద కన్వే చేశాడు డైరెక్టర్. కెరీర్ లో చదువుల్లో గెలవాలని ప్రేమను వదులుకున్న అంశంతో చాలా సినిమాలు వచ్చాయి అయితే ఈ పాయింట్ ను స్కూల్ డేస్ లవ్ నేపథ్యంతో తెరకెక్కించడమే కాలమేగా కరిగింది సినిమాకు కొత్తదనం తీసుకొచ్చింది.
ఫణి, బిందు లవ్ స్టోరీ అచ్చ తెలుగు డైలాగ్స్, మంచి మ్యూజిక్ తో ఆకట్టుకుంటుంది. ఈ జంట విడిపోవడంతో మళ్లీ వీరు ఎలా కలుస్తారు అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. బిందును వెతుకుతూ ఫణి చేసిన జర్నీ కొంత ఉత్కంఠకు గురిచేస్తుంది. బిందును ఫణి ఎలా కలుసుకున్నాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. పరిమిత పాత్రలు ఉన్నా, ప్రతి పాత్రకూ ఓ పర్పస్ ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. చిన్నప్పటి ఫణి బిందుగా అరవింద్ ముదగొండ, నోమిన తార అద్భుతంగా నటించారు. పెద్దయ్యాక వినయ్ కుమార్, శ్రావణి అంతే బాగా తమ పాత్రల్లో పర్ ఫార్మె చేశారు. ఈ రెండు జంటలు సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి.
టెక్నికల్ గా చూస్తే గుడప్పన్ బీజీఎం, పాటలు కాలమేగా కరిగింది సినిమాకు ఆకర్షణగా నిలుస్తాయి. కథకు తగినట్లు ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఉన్నాయి. దర్శకుడిగా సింగార మోహన్ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. పొయెటిక్ మేకింగ్ తో ఉన్న ఓ ప్లెజెంట్ లవ్ స్టోరీని చూడాలనుకుంటే కాలమేగా కరిగింది మంచి ఆప్షన్.
రేటింగ్ 3/5