రివ్యూ – “హోమ్ టౌన్” వెబ్ సిరీస్ ట్రైలర్

ఫాంటసీ నుంచి పుట్టే కథలు అప్పటికి వినోదాన్ని అందిస్తే..నిజ జీవితాలను రిఫ్లెక్ట్ చేసే స్క్రిప్ట్స్ ఎప్పటికి గుర్తుంటాయి. అవి మనల్ని మన జీవితాలను వెతుక్కునేలా చేస్తాయి. హోమ్ టౌన్ వెబ్ సిరీస్ ట్రైలర్ చూసిన వారికి ఇలాంటి నోస్టాల్జిక్ ఫీలింగ్ కలుగుతుంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, అనీ, ప్రజ్వల్ యాద్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ ను ఆహా ఏప్రిల్ 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఈ సిరీస్ ట్రైలర్ ను హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.

హోమ్ టౌన్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తూ – ఇద్దరు పిల్లలు, ఎన్నో బాధ్యతలు, తక్కువ ఆదాయంతో కుటుంబాన్ని పోషించే తండ్రి ప్రసాద్(రాజీవ్ కనకాల)కు కొడుకు శ్రీకాంత్ (ప్రజ్వల్ యాద్మ)ను విదేశాల్లో చదివించాలని కోరిక. శ్రీకాంత్ కు చదువుల మీద ఆసక్తి లేదు. పరీక్షల్లో అన్నీ కలిపి సగం మార్కులు కూడా అతనికి రావు. ఇంట్లో సహజంగానే గొడవ జరుగుతుంది.ఈ సంఘర్షణ ఎక్కడి దాకా వెళ్లింది. సరదాగా తిరిగే వయసున్న టీనేజ్ కుర్రాడు శ్రీకాంత్, తండ్రి ప్రసాద్ మనసు అర్థం చేసుకున్నాడా లేదా అనేది ట్రైలర్ లో ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ కలిపి ఆసక్తికరంగా చూపించారు.

హోమ్ టౌన్ వెబ్ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లే దర్శకత్వం వహించారు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు.