నటీనటులు: నాని, శృతి హాసన్, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా తదితరులు
టెక్నికల్ టీమ్: సినిమాటోగ్రఫీ – సాను జాన్ వరుగుస్, మ్యూజిక్ – హేషమ్ అబ్దుల్ వహాబ్, ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని, నిర్మాతలు: మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, దర్శకత్వం: శౌర్యువ్
నాని హీరోగా నటించిన మూవీ హాయ్ నాన్న ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఓ సెక్షన్ ఆడియెన్స్ లో బజ్ క్రియేట్ చేసింది. దసరా వంటి మాస్ మూవీ తర్వాత నాని చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
ముంబైలో ఫేమస్ ఫొటోగ్రాఫర్ విరాజ్ (నాని). అతను సింగిల్ పేరెంట్. లంగ్ ప్రాబ్లమ్ తో ఉన్న కూతురు మహి (బేబి కియారా ఖన్నా)తో కలిసి ఉంటుంటాడు. తల్లి గురించి కూతురు ఎన్నిసార్లు అడిగినా విరాజ్ చెప్పకుండా దాటేస్తుంటాడు. ఈ కోపంతో మహి విరాజ్ ను వదిలి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోతుంది. ఓ రోడ్డు ప్రమాదంలో పడబోయిన మహిని కాపాడుతుంది యశ్న (మృణాల్ ఠాకూర్). అలా యశ్న, మహి మంచి ఫ్రెండ్స్ అవుతారు. తండ్రి చెప్పే కథల్లో తల్లిగా యశ్నను ఊహించుకుంటుంది మహి. ఈ క్రమంలో విరాజ్ ను ప్రేమిస్తుంది యశ్న. విరాజ్ నుంచి వర్ష ఎందుకు విడిపోయింది. ఆ ప్లేస్ లోకి యశ్న రాగలిగిందా. అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ మూవీ. ఓపికగా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు చూడాల్సిన సినిమా. ఎక్కడా కమర్షియల్ సినిమా హైప్స్, ఎలివేషన్స్, హీరోయిజం వంటి అంశాలు ఉండవు. తండ్రీ కూతురు మధ్య అనుబంధంతో మొదలైన హాయ్ నాన్న….కూతురుకు లంగ్ ప్రాబ్లమ్ ఎక్కువ కాలం బతకదు అనే ఎమోషనల్ పాయింట్ మీద ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది. విరాజ్ జీవితంలో గతంలో జరిగిన సంఘటనలు, భార్యతో విడిపోవడం, కూతురుకున్న అనారోగ్యం ఇవన్నీ కథలోని సంఘర్షణకు కారణం అవుతాయి. కథ ఇలా మొదలైన కారణంగా ఫస్టాఫ్ మొత్తం స్లో గా సాగుతుంది. కథనం నెమ్మదిస్తుంది. మృణాల్ క్యారెక్టర్ ఎంట్రీతో కథలో కొన్ని మలుపులు మొదలవుతాయి. ఆమె విరాజ్ ను ప్రేమించడం, మహి కూడా యశ్నను తల్లిగా ఊహించుకోవడం కథనంలో వేగం పెరుగుతుంది. ఇందులో రెండు ప్రేమ కథలు ఉండగా…ఆ రెండు ప్రేమ కథల్లో బలమైన లవ్ బాండింగ్ ఏదీ కనిపించక పోవడం సినిమాకు మైనస్ అనుకోవచ్చు.
విరాజ్ వర్ష, విరాజ్ యశ్న లవ్ స్టోరీస్ లో బలం లేదు. యశ్నకు వర్షకు ఉన్న రిలేషన్ ఏంటి, మహి అసలు ఎవరి కూతురు అనేవి కథలో ఆసక్తి కలిగిస్తాయి. ఫస్టాఫ్ తో చూసుకుంటే సెకండాఫ్ బాగుందని అనుకోవాలి. మంచి కథను తెరకెక్కించే ప్రయత్నంలో దర్శకుడు శౌర్యవ్ పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. సెకండాఫ్ కొంత గడిచిన తర్వాత క్లైమాక్స్ మీద ప్రేక్షకులకు ఒక అంచనా వస్తుంది. వారి ఊహకు తగినట్లే క్లైమాక్స్ రావడంతో పెద్దగా కిక్ అనిపించదు. మొత్తంగా ఓ ఎమోషనల్ ఫ్యామిలీ కంటెంట్ మాత్రం తెరపై కనిపించినా..అది హండ్రెడ్ పర్సెంట్ ఫీల్ గుడ్ అనిపించదు. విరాజ్, మహీ, యశ్న మధ్య వచ్చే డైలాగ్స్ కొన్ని ఆకట్టుకునేలా ఉన్నాయి. విరాజ్ పాత్రలో నాని తనకు అలవాటైన పద్ధతిలో సహజంగానే బాగా చేశాడు. శృతి హాసన్ ఓ పాటలో మెరిసింది. మృణాల్ ఇలాంటి ఎమోషనల్ కంటెంట్ ను పండించడంలో దిట్ట అని మరోసారి ప్రూవ్ చేసుకుంది. మహి గా బేబి కియారా బాగా పర్ ఫార్మ్ చేసింది. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించి సినిమాలోని సీన్స్ బాగా ఎలివేట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్. సినిమాటోగ్రఫీ బాగుంది. కొంచెం ఓపికగా, తీరికగా సినిమాకు వెళ్లే మూడ్ ఉంటే హాయ్ నాన్న ప్రిఫర్ చేసుకోవచ్చు.