నటీనటులు – యష్ పూరి, అపూర్వ రావ్, అజయ్ ఘోష్, విష్ణు, ఝాన్సీ, అనిత చౌదరి, హర్ష్ రోషన్, జియ శర్మ, వంశీ నెక్కంటి, కేఎంఎమ్ మణి, కమల్ తుము, శ్వేత తదితరులు
టెక్నికల్ టీమ్ – సంగీతం – రవి నిడమర్తి, సినిమాటోగ్రఫీ- అశోక్ సీపల్లి, ఎడిటర్ – ప్రదీప్ ఆర్ మోరమ్,
స్క్రీన్ ప్లే – నాగసాయి, ప్రొడ్యూసర్స్ – యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల, స్టోరీ డైరెక్షన్ – కౌశిక్ భీమిడి
“చెప్పాలని ఉంది”, “అలాంటి సిత్రాలు”, “శాకుంతలం” వంటి సినిమాలతో టాలెంటెడ్ యంగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “హ్యాపీ ఎండింగ్” ఇవాళ థియేటర్స్ లోకి వచ్చింది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్, మంచి మెసేజ్ తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
కథేంటంటే
హర్ష్ కు రొమాన్స్ మీద చిన్నప్పటి నుంచి ఇష్టం. ఫ్రెండ్స్ మాటలు విని ఒక అడల్ట్ మూవీ చూసేందుకు థియేటర్ కు వెళ్తాడు. అక్కడికి ఓ బాబా రథేశ్వర్ స్వామిజీ (అజయ్ ఘోష్) కూడా వస్తాడు. హర్ష్ చేసిన హంగామా వల్ల ఆ బాబాను జనాలకు గుర్తుపట్టేస్తారు. దాంతో ఆ స్వామిజీ హర్ష్ ను శపిస్తాడు. హర్ష్ ఏ అమ్మాయిని ఇష్టపడినా ఆమె చనిపోతుంది. హర్ష్ పెద్దయ్యాక మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తుంటాడు. అతనికి అవని (అపూర్వ రావ్) కలుస్తుంది. ఆమెను లవ్ చేస్తాడు హర్ష్. వీరి ప్రేమకు హర్ష్ కు ఉన్న శాపం ఇబ్బంది కలిగించిందా లేదా…అతని శాపం ఎలా విముక్తి అయ్యింది. ఇందుకు అవని చేసిన సపోర్ట్ ఏంటి అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
పురాణాల్లోని శాపం అనే అంశాన్ని ట్రెండీ అంశాలతో కలిపి ఇప్పటి ఆడియెన్స్ కు నచ్చేలా రూపొందించిన సినిమా ఇది. 3 వేల ఏళ్ల క్రితం రాసిన పురాణాల్లో మనం ఇలాంటి శాపాలు చూశాం. ఈ శాపం అనేది ఇప్పటి కాంటెంపరరీ టైమ్ కు ముడిపెట్టడం అనే పాయింట్ దగ్గరే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఈ పాయింట్ ఎంత ఎగ్జైటింగ్ గా ఉందో అంతే ఆసక్తికరంగా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు కౌశిక్ భీమిడి. సినిమా ప్రారంభమైన మొదటి పది నిమిషాలకే శాపం గురించి రివీల్ చేశారు. దీంతో ఇక్కడి నుంచి హీరో క్యారెక్టర్ ఎలా వెళ్తుంది అనే సస్పెన్స్ మొదలైంది. హీరో, అతనికి ఉన్న శాపం, వాటి వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఫ్రెండ్స్ తో హర్ష్ చేసే సరదా సందడితో ఫస్టాఫ్ అంతా హ్యాపీగా వెళ్తుంది. సెకండాఫ్ లో ఎమోషనల్ ఈవెంట్స్ మొదలవుతాయి. క్లైమాక్స్ లో చూపించిన సైకలాజికల్ డ్రైవ్ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది.
హర్ష్ క్యారెక్టర్ లో యష్ పూరి ఎంతో సహజంగా నటించాడు. నిజంగానే శాపం వల్ల ఓ కుర్రాడు ఇబ్బంది పడితే ఎలా ఉంటుందో తన పర్ ఫార్మెన్స్ లో చూపించాడు. అవని క్యారెక్టర్ అపూర్వ రావ్ కు టైలర్ మేడ్ అని చెప్పాలి. ఆమెకు ఇది ఫస్ట్ మూవీ అయినా ఇంప్రెసివ్ గా నటించింది. ఝాన్సీ, అజయ్ ఘోష్ క్యారెక్టర్స్ కథలో కీలకంగా ఉన్నాయి. అమ్మాయి అబ్బాయి మధ్య ప్యూర్ లవ్ ఉంటే ఏదీ వాళ్లను విడదీయలేదు అనే మంచి విషయాన్ని హ్యాపీ ఎండింగ్ చూపిస్తుంది. ట్రైలర్ చూసి యూత్ ఫుల్ ఎలిమెంట్స్ ఉన్నాయని అనుకునేవారు…ఇందులో సొఫెస్టికేటెడ్ గా ఎవరూ ఇబ్బంది పడకుండా కథను చూపించిన విధానానికి ఇంప్రెస్ అవుతారు. టెక్నికల్ గా చూస్తే…మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వంటి అన్ని విభాగాలన్నీ బలంగా ఉంటూ సినిమాను మరింత ఎలివేట్ చేశాయి. ఓ డిఫరెంట్ సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ కోసం ఆడియెన్స్ కు హ్యాపీ ఎండింగ్ మంచి ఆప్షన్.
రేటింగ్ 3/5