రివ్యూ – “గేమ్ ఛేంజర్” ట్రైలర్

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న భారీ పొలిటికల్ డ్రామా గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ చేశారు. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ ట్రైలర్ ను లాంఛ్ చేశారు. పాన్ ఇండియా మూవీగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఈ నెల 10న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ ప్రెస్టీజియస్ సినిమాకు కావాల్సినంత బజ్ ను ట్రైలర్ క్రియేట్ చేసిందా లేదా రివ్యూలో చూద్దాం.

రాష్ట్రానికి స్వార్థపరుడైన రాజకీయనాయకుడు బొబ్బిలి మోపిదేవి (ఎస్ జే సూర్య) ముఖ్యమంత్రి అవుతాడు. ఎలక్షన్స్ లో ఎన్నో నేరాలు చేసి సీఎంగా కుర్చీ ఎక్కుతాడు. అతనికి గతంలో అప్పన్న(రామ్ చరణ్) తో వైరం ఉంటుంది. ఈ అప్పన్న కొడుకే యువ ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ (రామ్ చరణ్). ఒక సీఎంను నేరుగా కలవడానికే ఐఏఎస్ ఆఫీసర్ కు ఎంతో ప్రోటోకాల్ ఉంటుంది. అలాంటి ఐఏఎస్ ఆఫీసర్ రామ్ నందన్ ఏకంగా ఆ సీఎంతోనే పోటా పోటికి దిగుతాడు. ఏనుగు ఒక్క ముద్ద వదిలేసినా, లక్ష జీవులు తింటాయి..అంటూ ఈ సొసైటీలో వందల, వేల కోటీశ్వరులు, అక్రమార్జన చేసే నాయకులు పేదలకు కొంత మిగల్చాలనే పాయింట్ ను దర్శకుడు శంకర్ చెప్పాడు. ఇదంతా మెయిన్ థీమ్ కాగా.. శంకర్ సినిమాల్లోని పాటల్లో ఉండే భారీతనం, మేకింగ్ లోని స్టాండర్డ్స్ గేమ్ ఛేంజర్ ట్రైలర్ లో కనిపించాయి. రామ్ చరణ్ అప్పన్న, రామ్ నందన్ పాత్రల్లో ఆల్ రౌండ్ పర్ ఫార్మెన్స్ చేశాడు.