“ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్” రివ్యూ – ఆర్డినరీ సినిమానే

నటీనటులు – నితిన్, శ్రీలీల, రాజశేఖర్, రావు రమేష్, సుదేవ్ నాయర్, సంపత్ రాజ్, రోహిణి తదితరులు

టెక్నికల్ టీమ్ – సినిమాటోగ్రఫీ – ఆర్థర్ ఎ విల్సన్, యువరాజ్, సాయి శ్రీరామ్, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, మ్యూజిక్ – హ్యారిస్ జయరాజ్, నిర్మాణం – శ్రేష్ఠ్ మూవీస్, రచన దర్శకత్వం – వక్కంతం వంశీ.

హిలేరియస్ ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాలు క్రియేట్ చేసింది నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమా. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సక్సెస్ ఫుల్ రైటర్ వక్కంతం వంశీ రూపొందించారు. దర్శకుడిగా ఆయనకు ఈ సినిమాతోనైనా హిట్ పడుతుందని అంతా అనుకున్నారు. మరి ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్ థియేటర్ లో నిజమయ్యాయా లేదా రివ్యూలో చూద్దాం

కథేంటంటే

సినిమాల్లో జూనియర్ ఆర్టిస్టుగా చిన్న చిన్న వేషాలు వేస్తుంటాడు బాలు (నితిన్). ఇంట్లో వాళ్లకు మాత్రం తను ఇలాంటి పనులు చేయడం ఇష్టం ఉండదు. ముఖ్యంగా తండ్రికి. కొడుకుతో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. కానీ ఏదో రోజు ఇండస్ట్రీలో పైకొస్తాననేది బాలు నమ్మకం. అయితే ఆ నమ్మకం పోయి కొన్నాళ్లకు ఉద్యోగంలో చేరతాడు. ఆ కంపెనీకి సీయీవో అయ్యే అవకాశం వస్తుంది. ఇంతలో ఇన్నాళ్లూ తను ఎదురుచూసిన హీరోగా సినిమా అవకాశమూ దక్కుతుంది. కంపెనీ వదిలేసి మళ్లీ సినిమాల్లోకి వెళ్లగానే అక్కడ ఆ సినిమా నుంచి మనోడిని హీరోగా తప్పిస్తారు. ఇలా అటు కంపెనీలో సీయీవో జాబ్ పోయి, ఇటు హీరోగా అవకాశం పోయిన టైమ్ లో బాలు ఏం చేశాడు అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే

దర్శకుడు వక్కంతం వంశీ రైటర్ గా బలమైన కథలు రాశాడు. అతనొక్కడే, కిక్, రేసు గుర్రం వంటి సినిమాలు రచయితగా ఆయన బలాన్ని చూపిస్తాయి. ఈ సినిమాల్లో బలమైన కథతో పాటు మంచి కామెడీ ఉంటుంది. అయితే దర్శకుడిగా మారినప్పుడు మాత్రం ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాడు వంశీ. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో కాసేపు బాగానే నవ్వించినా…అసలైన కథ చెప్పడంలో తడబడ్డాడు దర్శకుడు. ఫలితంగా నవ్వులతో సాగాల్సిన సినిమా నవ్వుల పాలయ్యింది. హీరో ఫాదర్ ట్రాక్ కాసేపు బాగుంది, ఆ తర్వాత బోర్ కొడుతుంది. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కు అసలు లాజిక్కే లేదు. విలన్ ఎంట్రీ క్రూరంగా, బలంగా ఉన్నా వెంటనే అతన్ని జోకర్ ను చేసేసారు. దీంతో హీరో, విలన్ మధ్య కాన్ ఫ్లిక్ట్ లేకుండా పోయింది.

అప్పటిదాకా దురదృష్టం వెంటాడిన హీరోకు..వెంటనే హీరోయిన్ తో లవ్, కంపెనీలో సీయీవో..ఇలా కలిసి రావడం ..సినిమాటిక్ లిబర్టీ బాగా తీసుకున్నట్లు ఫీలయ్యేలా చేస్తుంది. ఈ మధ్య మన సినిమాల్లో ఒక పని చేసే హీరో వెంటనే మరో ఉద్యోగానికి మారిపోయి హంగామా చేయడం చూస్తుంటాం. ఈ సినిమాలోనూ అది కనిపించింది. ఫస్టాఫ్ పర్వాలేదనిపించే ఈ సినిమా సెకండాఫ్ లో మరీ తేలిపోయింది. మొత్తం సినిమా కామెడీ అనుకునే కంగాళీగా తయారైంది. దాంతో…ఇది ఎక్స్ట్రా ఆర్డినరీ కాదు ఆర్డినరీ మూవీగా ఆడియెన్స్ తేల్చేశారు. నటీనటుల పరంగా నితిన్, శ్రీలీల, రావు రమేష్ పర్ ఫార్మెన్స్ బాగుంది. టెక్నికల్ స్ట్రాంగ్ మూవీ ఇది. సినిమాలో విషయం లేక ఈ హంగులన్నీ ఉపయోగపడకుండా పోయాయి.