నటీనటులు – ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు
టెక్నికల్ టీమ్ – డీవోపీ – ప్రశాంత్ అంకిరెడ్డి, ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్, మ్యూజిక్ – శ్రీ వసంత్, లిరిక్స్ – చంద్రబోస్, ప్రొడ్యూసర్స్ – బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్, రచన, దర్శకత్వం – కిరణ్ తిరుమలశెట్టి
యూత్ ఫుల్ కంటెంట్ , సూపర్ హిట్ సాంగ్స్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సినిమా డ్రింకర్ సాయి. ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. ప్రేక్షకుల్ని థియేటర్స్ కు ఆకర్షించేందుకే యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రమోషన్ చేశామని, సినిమాలో మంచి మెసేజ్ ఉందంటూ టీమ్ చెబుతూ వచ్చారు. మరి అలాంటి హార్ట్ టచింగ్ కంటెంట్ మూవీలో ఎంతవరకు ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన యువకుడు సాయి (ధర్మ). మంచీ చెడు చెప్పే పేరెంట్స్ లేకపోవడంతో మద్యానికి అలవాటు పడతాడు. ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తుంటాడు. బాగీ (ఐశ్వర్య శర్మ) మెడికల్ స్టూడెంట్. ఆమెకు మందు, సిగరెట్ తాగే వాళ్లంటే పడదు. ఆ అమ్మాయి ఒకరోజు సాయిని బైక్ తో యాక్సిడెంట్ చేసి పారిపోతుంది. తనను ఢీకొట్టింది ఎవరో తెలుసుకున్న సాయి ..బాగీని చూడగానే ప్రేమలో పడతాడు. బాగీ కూడా సాయిని ప్రేమిస్తున్నట్లు నటిస్తుంది. సాయికి ఉన్న చెడు అలవాట్లు చూసి అతనికి దూరమవుతుంది. ఈ బ్రేకప్ ను సాయి ఎలా భరించాడు. ఈ క్రమంలో సాయికి ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి, సాయి ప్రేమను బాగీ అర్థం చేసుకుందా. ఈ జంట ఎలా ఒక్కటయ్యారు అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
డ్రింకర్ సాయి సినిమా రివ్యూలోకి వెళ్లేముందు ఈ మూవీ టీమ్ అంతా ప్రమోషనల్ ఈవెంట్స్ లో చెప్పిన మాటలన్నీ నిజాలేనని ఒప్పుకోవాలి. ట్రైలర్ లో ఇతర కంటెంట్ లో చూపించినట్లు ఇది యువతను తప్పుదారి పట్టించే సినిమా కాదు. కొంత యూత్ ఫుల్ కంటెంట్ ఉన్నా, అది మనం రెగ్యులర్ గా ఈ మధ్య చూస్తున్న సినిమాలతో చూస్తే చాలా తక్కువే. సాయి క్యారెక్టర్ తో ఫన్ క్రియేట్ చేస్తూ సాగుతుంటుంది సినిమా. సాయి, బాగీ మధ్య పరిచయం, సాయి బాగీని సిన్సియర్ గా లవ్ చేయడం, బాగీ మాత్రం ప్రేమిస్తున్నట్లు నటించడం..ఇవన్నీ ఎంటర్ టైనింగ్ గా సాగుతుంటాయి. ఇంటర్వెల్ తర్వాత నుంచే కథలో ఇంటెన్సిటీ పెరుగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు 40 నిమిషాల సినిమా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. దర్శకుడు కిరణ్ ఒక మంచి మెసేజ్ ఉన్న కథను కమర్షియల్ ఎలిమెంట్స్ అనే కోటింగ్ వేసి ఆకట్టుకునేలా డ్రింకర్ సాయి సినిమాను రూపొందించాడు. అతని ప్రయత్నం జెన్యూన్ గా ఉంది. సినిమా చూశాక రిలీజ్ కు ముందు మూవీ మీదున్న ఇంప్రెషన్ పోతుంది. ఒక మంచి అటెంప్ట్ అనే ఫీల్ కలిగిస్తుంది.
సాయి పాత్రలో ధర్మ నటన మెచ్యూర్డ్ గా ఉంది. తాగుబోతు క్యారెక్టర్ లో మెప్పించడం మామూలు విషయం కాదు. కానీ తన పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు ధర్మ. ఫన్ సీన్స్ లో, ఎమోషనల్ సీన్స్ లో మెప్పించాడు. పాటల్లో అతను చేసిన డ్యాన్సులు ఎనర్జిటిక్ గా ఉన్నాయి. బాగీ పాత్రలో ఐశ్వర్య శర్మ పర్పెక్ట్ గా కుదిరింది. మంచి లుక్స్ తో బ్యూటిఫుల్ గా కనిపించింది. ఐశ్వర్య కూడా ధర్మతో యాక్టింగ్ లో పోటీ పడింది. సాయి వంతెన క్యారెక్టర్ హిలేరియస్ గా ఉంది. ఎస్ఎస్ కాంచీ, సమీర్, రీతు చౌదరి…ఇలా మెయిన్ కాస్టింగ్ అంతా కథలో పర్పస్ ఫుల్ క్యారెక్టర్స్ చేశారు.
టెక్నికల్ గా డ్రింకర్ సాయి మంచి క్వాలిటీతో కనిపించింది. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. అలాగే శ్రీవసంత్ మ్యూజిక్ ఇచ్చిన పాటలు రిలీజ్ కు ముందే సూపర్ హిట్ అయ్యాయి. మొదటి చిత్రంతోనే నిర్మాతలు బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ మంచి ప్రయత్నం చేశారు. ప్యాషనేట్ గా మూవీ నిర్మించారు. డైరెక్టర్ కిరణ్ కు పేరుతెచ్చే చిత్రమవుతుంది. యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో పాటు మంచి సాంగ్స్, ఎమోషన్, మెసేజ్ ఉన్న డ్రింకర్ సాయిని ఈ వీక్ ప్రేక్షకులకు థియేటర్స్ కు వెళ్లి చూసేందుకు బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
రేటింగ్ 3/5