రివ్యూ – “దిల్ రూబా” ట్రైలర్

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన దిల్ రూబా సినిమా ట్రైలర్ రిలీజైంది. లవ్, ఎమోషన్, యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ప్రారంభంలో లవ్ ఫెయిలైన భగ్న ప్రేమికుడు సిద్ధుగా కనిపించిన కిరణ్ అబ్బవరం, ఆ తర్వాత అంజలి(రుక్సర్ థిల్లాన్) ప్రేమకు అడిక్ట్ అవుతాడు. లవ్ చేస్తున్నానంటూ వెంటపడిన అంజలి మొదట్లో వద్దనుకున్న సిద్ధు ఆమె ప్రేమలో మునిగిపోతాడు. నువ్వే నా డ్రగ్ నీకు అడిక్ట్ అయ్యా అనేంతగా ప్రేమిస్తాడు. సిద్ధు క్యారెక్టర్ ను నమ్ముకున్న వ్యక్తి. తప్పు చేయనిదే సారీ ఎందుకు చెప్పాలనే తత్వం అతనిది. ఏది ఏమైనా తన క్యారెక్టర్ ను వదులుకోని సిద్ధు లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది. అంజలితో తన లవ్ ను సిద్ధు ఎలా గెలిపించుకున్నాడు అనేది ట్రైలర్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. తప్పు చేయని వాడు హీరో, చేసిన తప్పు తెలుసుకున్నవాడు ఇంకా పెద్ద హీరో, ప్రేమ గొప్పది కాదు అది ఇచ్చే మనిషి గొప్ప అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

“దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. “దిల్ రూబా” సినిమా మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.