సరికొత్త కాన్సెప్ట్స్ లతో రియాల్టీ షోస్ చేయడంలో ముందుంటారు హోస్ట్ ఓంకార్. ఆట షో నుంచి డ్యాన్స్ షోస్ కు ఒక క్రేజ్ తీసుకొచ్చిన క్రెడిట్ ఓంకార్ కే దక్కుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది డ్యాన్సర్స్ కు తన షోస్ ద్వారా గుర్తింపు తీసుకొచ్చిన ఓంకార్ ఇప్పుడు “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” అంటూ నిజంగానే స్టేజీ తగలబెట్టేసే డ్యాన్స్ షో తీసుకొస్తున్నారు. దేశవ్యాప్తంగా పంచభూతాలైన అగ్ని, నీరు, గాలి, భూమి, ఆకాశం వంటి ఐదుగురు కంటెస్టెంట్స్ ను సెలెక్ట్ చేసి వారితో మెస్మరైజింగ్ పర్ ఫార్మెన్స్ చేయించబోతున్నారు. రేపు సాయంత్రం 7 గంటల నుంచి ఆహా ఓటీటీ “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” ను మీ ముందుకు తీసుకొస్తోంది. ఫస్ట్ టైమ్ ఒక డ్యాన్స్ షోకు సీక్రెట్ స్క్రీనింగ్ 20 నిమిషాల పాటు మీడియాకు వేసి ట్రెండ్ క్రియేట్ చేసింది ఆహా.
“డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” ప్రోమో చూస్తే ఈ షో ఎంత ఎంగేజ్ చేస్తుందో అర్థమవుతోంది. హోస్ట్ లు శేఖర్ మాస్టర్, ఫరియా అదిరిపోయే డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ లతో ప్రోమో మొదలవగా…మెంటార్స్ మానస్, యష్ మాస్టర్, దీపిక, ప్రకృతి, జాను లైర్ తమ స్టెప్పులతో తమ డ్యాన్సింగ్ టాలెంట్ చూపించారు. నటి రోహిణి తన పంచ్ లతో నవ్వించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా హోస్ట్ ఓంకార్ మెంటార్స్ కు ఇచ్చిన టాస్క్ లు, వారు చేసిన పర్ ఫార్మెన్స్ లు నవ్వించాయి. గిఫ్ట్ ప్యాక్ లో ఉన్న పంచభూతాల్లాంటి ఐదుగురు కంటెస్టెంట్స్ ను మెంటార్స్ సెలెక్ట్ చేసుకున్న తీరు సరికొత్తగా ఉంది. ఇక ఈ ఐదుగురు కంటెస్టెంట్స్ పర్ ఫార్మెన్స్ నిజంగానే స్టేజీని తగలబెట్టేసేలా ఉంది. ఆహా ఓటీటీలో “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్” ఐకానిక్ డ్యాన్స్ షో కాబోతోందనే వైబ్స్ ఏర్పడుతున్నాయి.