నటీనటులు – వేణు తొట్టెంపూడి, అవంతిక శర్మ, అదితి గౌతమ్, వెంకటేష్ కాకుమాను తదితరులు
టెక్నికల్ టీమ్ – సినిమాటోగ్రఫీ – మనోజ్, సంగీతం – కపిల్, బ్యానర్ – రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్, షో రన్నర్ – ప్రవీణ్ సత్తారు, రచన దర్శకత్వం – భరత్ వైజీ
ఎపిసోడ్స్ – 6
ఓటీటీ – డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్
ఒకప్పుడు ఫ్యామిలీ మూవీస్ హీరో వేణు తొట్టెంపూడి నటించిన తొలి వెబ్ సిరీస్ గా “అతిథి” సినీ ప్రియుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ తో ఉన్న ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో “అతిథి” వెబ్ సిరీస్ చూడాలనే ఆసక్తి మొదలైంది. ఇవాళ స్ట్రీమింగ్ క వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
దెయ్యాలు లేవని నిరూపించే వీడియోస్ చేస్తుంటాడు యూట్యూబర్ సవారి (వెంకటేష్ కాకుమాను). అతను సంధ్య నిలయం అనే పెద్ద ఇంటికి వెళ్తాడు. అప్పటికే ఆ ఇంటికి రాత్రి పూట అతిథిగా వస్తుంది మాయ (అవంతిక మిశ్రా). ఆ ఇంటిలో ఉండేది రచయిత రవి వర్మ (వేణు), అతని భార్య సంధ్య (అదితీ). మాయ ప్రవర్తనను అనుమానంగా చూస్తుంటాడు సవారి. మాయ దెయ్యమే అనేది అతని నమ్మకం. అనూహ్యంగా మాయ అదే ఇంట్లో చనిపోతుంది. మాయ నిజంగానే దెయ్యమా లేక మనిషా, సంధ్య మృతికి కారణం ఏంటి, రవి వర్మ, సంధ్య ఇద్దరే అంత పెద్ద ఇంట్లోఒంటరిగా ఎందుకు ఉన్నారు అనేది మిగిలిన కథ.
ఎలా ఉందంటే
మనిషికున్న లోపాలు అతన్ని ఎలాంటి పరిస్థితికి తీసుకొస్తాయి అనేది ఈ వెబ్ సిరీస్ ద్వారా దర్శకుడు భరత్ చెప్పాలనుకున్నాడు. ఎన్ని ఏళ్లు గడిచినా మనిషి బలహీనతలు మారవని చెబుతూనే ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ రన్ చేశాడు. తొలి రెండు ఎపిసోడ్స్ తో కథలో వేగం మొదలవుతుంది. ట్విస్ట్, టర్న్స్ వస్తుంటాయి. మాయ మనిషా, దెయ్యామా అనే సందేహం ప్రేక్షకుల్లో నాటుకుపోతుంది. ఇదేంటో తెలుసుకోవాలనే ఆసక్తి మొదలవుతుంది.
“అతిథి”లోని రెండు స్మాల్ స్టోరీస్ ఆకట్టుకున్నాయి. మాయ మృతితో స్టోరీలో ఒక కుదుపు మొదలవుతుంది. రవి వర్మ ఫ్లాష్ బ్యాక్ ను కూడా అంతే గ్రిప్పింగ్ గా తెరకెక్కించాడు దర్శకుడు భరత్. చివరలో వచ్చే క్లైమాక్స్ “అతిథి”కి బిగ్ హైలైట్. ఇక ఈ సిరీస్ కు పార్ట్ 2 ఉంటుందనే హింట్ కూడా ఇచ్చాడు దర్శకుడు.
రవివర్మ పాత్రలో వేణు ఒదిగిపోయాడు. ఆయన చేసిన రెండు క్యారెక్టర్స్ లో మంచి పర్ ఫార్మెన్స్ చేశాడు. అవంతిక మిశ్రా “అతిథి”కి ఆకర్షణగా నిలిచింది. ఆమె అందం, నటన సిరీస్ కు అసెట్ అయ్యాయి. వెంకటేష్ కాకుమాను భయపడుతూ, నవ్వించాడు. మనోజ్ సినిమాటోగ్రఫీ, కపిల్ మ్యూజిక్ “అతిథి”ని మరో రేంజ్ కు తీసుకెళ్లాయి. ఆరు ఎపిసోడ్ల “అతిథి” వెబ్ సిరీస్ ఆద్యంతం మిమ్మల్ని కదలకుండా చూసేలా చేస్తుంది. డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఇది మరొక హిట్ వెబ్ సిరీస్ అనుకోవచ్చు.