రివ్యూ – “ఆర్టిస్ట్” మూవీ ట్రైలర్

సంతోష్ కల్వచెర్ల, క్రిషేక పటేల్ జంటగా నటిస్తున్న సినిమా “ఆర్టిస్ట్”. ఈ సినిమాను ఎస్ జేకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మిస్తున్నారు. రతన్ రిషి దర్శకత్వం వహిస్తున్నారు. “ఆర్టిస్ట్” మూవీ ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

“ఆర్టిస్ట్” ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – నీకూ నాకూ ప్రపంచం ఒక్కటే కానీ నువ్వు నేను ఎప్పటికీ ఒక్కటి కాలేము అనే క్యాప్షన్ తో ఈ సినిమా ట్రైలర్ ప్రారంభమైంది. హీరోను డ్రింకర్ గా చూపించాక..సిటీలో జరుగుతున్న అమ్మాయిల మర్డర్స్ గురించి, ఆ కిల్లర్ గురించి హింట్ ఇచ్చారు. అమ్మాయిలకు హీరోయిన్స్ మాస్క్ లు వేసి హత్యాచారం చేస్తుంటాడు ఓ సైకో కిల్లర్. ఈ నేపథ్యంలో పోలీసులు హీరోను ఎందకు అరెస్ట్ చేశారు. పోలీసుల అదుపులోనుండి తప్పించుకున్న నేరస్తుడు బాహుబలి ప్రభాకర్ ఆ తర్వాత ఏం చేశాడు అనేది ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు. లవ్, యాక్షన్, రొమాన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో “ఆర్టిస్ట్” ట్రైలర్ ఆకట్టుకుంది.