రివ్యూ – “800” ట్రైలర్

క్రికెట్ లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్ గా ప్రపంచ రికార్డ్ సృష్టించారు. శ్రీలంక స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్. ఆయన బయోపిక్ గా తెరకెక్కిన సినిమా 800. ఈ సినిమాలో నటుడు ముధు మిట్టల్ మురళీధరన్ క్యారెక్టర్ లో నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. 800 సినిమా అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

శ్రీలంకలో సివిల్ వార్ జరుగుతున్న టైమ్ లో శరనార్థులుగా వెళ్లిన ముత్తయ్య మురళీధరన్ కుటుంబం అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతుంది. పౌరసత్వం ఇచ్చేందుకు కూడా లంక ప్రభుత్వం ఒప్పుకోదు. పేద కుటుంబం నుంచి క్రికెటర్ గా ఎదుగుతాడు మురళీధరన్. స్పిన్నర్ గా జాతీయ స్థాయిలో రాణించి, శ్రీలంక జాతీయ జట్టులో ఎంపికవుతాడు. అక్కడి నుంచి ప్రపంచ క్రికెట్ లో మురళీధరన్ చరిత్ర మొదలవుతుంది. అయితే స్పిన్ బౌలింగ్ లో బాల్ త్రో చేస్తున్నాడనే ఆరోపణలతో పలు పరీక్షలు ఎదుర్కొంటాడు, అలాగే శ్రీలంక టీమ్ పై పాకిస్థాన్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి అతని జీవితంపై ప్రభావం చూపిస్తున్నాయి. నువ్వెవరు..తమిళుడా, శ్రీలంక పౌరుడివా అని అడిగితే మురళీధరన్ నేను క్రికెటర్ ను అని చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుందిఇ. ఇలా మురళీధరన్ జీవితం అనేక భావోద్వేగాలతో, మలుపులతో సాగుతుంది. ఇవన్నీ ట్రైలర్ లో ఆకట్టుకునేలా చూపించారు.