“పొలిమేర” సిరీస్ సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మొదటి మూవీ “28°C” రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఏప్రిల్ 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. “28°C” సినిమాలో నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు. “28°C” సినిమా ట్రైలర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. ట్రైలర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం
వైజాగ్ సిటీలో కార్తీక్, అంజలి మెడిసిన్ చేస్తుంటారు. అంజలిని చూడగానే ఇష్టపడిన కార్తీక్ ఆమెకు లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆమె కూడా కార్తీక్ ను ఇష్టపడుతుంది. మూడు ముళ్లతో ఈ జంట ఒక్కటవుతారు. వాళ్లు వెళ్లిన కొత్త ఇంట్లో అనూహ్య ఘటనలు జరుగుతుంటాయి. ఆ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా, లేక ఈ కార్తీక్, అంజలి ఏదో జరుగుతున్నట్లు ఊహించుకుంటున్నారా అనేది ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. అంజలికి ఉన్న డిసీజ్ ఏంటి, ఇబ్బందికరంగా ఉన్నా, కార్తీక్ ఆ ఇంటిని ఎందుకు వదిలేయడం లేదు అనేది తెరపై చూడాల్సిందే. థ్రిల్లింగ్ ఫ్రెష్ లవ్ స్టోరీగా “28°C” ట్రైలర్ ఆకట్టుకుంటోంది.