నటీనటులు – నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి, వి జయప్రకాష్, ప్రియదర్శి పులికొండ, హర్ష చెముడు, రాజా రవీంద్ర, తదితరులు
టెక్నికల్ టీమ్ – ఎడిటర్ – గ్యారీ బీహెచ్, డీవోపీ – వంశీ పచ్చిపులుసు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – శ్రీచరణ్ పాకాల, మ్యూజిక్ – శ్రావణ్ భరద్వాజ్, ప్రొడ్యూసర్ – సాయి అభిషేక్, దర్శకత్వం – డా. అనిల్ విశ్వనాథ్
టెంపరేచర్ ను కీ పాయింట్ గా చేసుకుని తెరకెక్కిన చిత్రంగా 28°C సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా దర్శకుడు డా.అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన 28°C సినిమా ఆడియెన్స్ ను ఎంతగా మెప్పించిందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే
ఓ అమ్మాయి హత్యకేసు ఇన్వెస్ట్ గేట్ చేసేందుకు వచ్చిన పోలీస్ అఫీసర్ (రాజా రవీంద్ర)..ఆ హత్యకు డాక్టర్ కార్తీక్ (నవీన్ చంద్ర) కారకుడనే కోణంలో విచారణ చేస్తుంటాడు. అతనికి కార్తీక్ ఇంట్లో ఓ డైరీ లభిస్తుంది. డాక్టర్ అంజలి(షాలినీ వడ్నికట్టి)తో కార్తీక్ ప్రేమ కథతో ఆ డైరీ మొదలవుతుంది. వైజాగ్ లో వైద్య విద్య చదువుకునే మెడికల్ స్టూడెంట్ కార్తీక్, అంజలిని ప్రేమిస్తాడు. వీళ్లు పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలనుకునే టైమ్ లో అంజలి అనారోగ్యం బారిన పడుతుంది. ఆమె 28 సెంటిగ్రేడ్ డిగ్రీల వేడిని మాత్రమే భరించగలదని వైద్యులు చెబుతారు. అయినా కార్తీక్ అంజలిని పెళ్లి చేసుకుని ఆమెను కాపాడుకోవాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కార్తీక్, అంజలి జార్జియా ఎందుకు వెళ్లారు. అక్కడ అంజలి ఆరోగ్య పరిస్థితి మెరుగైందా లేదా, కార్తీక్, అంజలి జీవితం ఆ తర్వాత ఎలాంటి మలుపులు తిరిగింది. అమ్మాయి హత్య కేసులో కార్తీక్ ఎందుకు నిందితుడిగా మారాడు..ఇలాంటి ఆసక్తికర అంశాలన్నీ తెరపై చూడాలి.
ఎలా ఉందంటే
ప్రేమకు అర్థం త్యాగమని, ఒకరి లేకుండా మరొకరు ఉండలేరని చెబుతూ సాగే ఎమోషనల్ లవ్ స్టోరీ ఇది. ఈ కథకు 28°C అనే కొత్త పాయింట్ యాడ్ చేసి దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ కొత్త తరహా లవ్ ఫ్లస్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీని తెరపై ఆవిష్కరించాడు. అమ్మయి హత్య కేసు ఇన్వెస్టిగేషన్ తో ఆసక్తికరంగా కథ మొదలవుతుంది. అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ వైజాగ్ షిఫ్ట్ అవుతుంది. వైజాగ్ ఫ్లాష్ బ్యాక్ లో కార్తీక్, అంజలి ప్రేమ కథను ప్లెజెంట్ గా ఎంటర్ టైనింగ్ గా చూపించారు. అంజలి అనారోగ్యం గురించి తెలియడం, ఆమెను కాపాడుకునేందుకు కార్తీక్ చేసే ప్రయత్నాలు హార్ట్ టచింగ్ గా ఉంటాయి.
జార్జియా వెళ్లిన తర్వాత కార్తీక్, అంజలి జీవితాల్లో ఎదురైన సంఘటనలు ఉత్కంఠకు గురిచేస్తాయి. సెకండాఫ్ మొదలైన కాసేపటి నుంచి 28°C సినిమా ఇంట్రెస్టింగ్ టర్న్స్ తో ఊహకు అందకుండా సాగుతుంది. డైరెక్టర్ డాక్టర్ కాబట్టి మెడికల్ టర్మ్స్ చాలా ఆంథెంటిక్ గా ఈజీగా అర్థమయ్యేలా చెప్పగలిగారు. రివ్యూలో రివీల్ చేయకూడని ఒక క్యారెక్టర్ ఈ కథను మొత్తం మలుపు తిప్పుతుంది. ఆ క్యారెక్టర్ ఎవరు ఏంటి అనేది స్క్రీన్ మీద చూడాలి.
కార్తీక్ గా నవీన్ చంద్ర చాలా బాగా పర్ ఫార్మ్ చేశాడు. ఆరేళ్ల కిందటి సినిమా కాబట్టి ఈ లవ్ స్టోరీలో ఇప్పటికంటే ఫ్రెష్, యంగ్ గా కనిపించాడు. షాలినీ అంజలి పాత్రకు సరిగ్గా సరిపోయింది. ఆమె అంజలిగా చూపించిన నటన మెప్పిస్తుంది. స్నేహితుల పాత్రల్లో ప్రియదర్శి, హర్ష చెముడు, అభయ్ బేతిగంటి మంచి సపోర్టింగ్ రోల్స్ చేశారు. అయితే షార్ప్ గా నిడివి ఉండటం వల్ల వారికి సంబంధించిన ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ తీసేసినట్లు తెలుస్తోంది.
టెక్నికల్ గా టాప్ క్వాలిటీతో 28°C మూవీ ఉంది. శ్రావణ్ భరద్వాజ్ చేసిన పాటలు, శ్రీచరణ్ పాకాల బీజీఎం ఆకట్టుకుంటాయి. ఫస్ట్ మూవీ అయినా ప్రొడ్యూసర్ గా సాయి అభిషేక్ టేస్ట్ తెలుస్తోంది. ఆయన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లోనూ మెరిశారు. దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ కూడా బాగా డీల్ చేయగలడని 28°C సినిమా ప్రూవ్ చేసింది. ఆయన రైటింగ్ స్టైల్ కూడా ఆకట్టుకుంది. అనిల్ విశ్వనాథ్ గెస్ట్ రోల్ లో చిన్న సీన్ లో కనిపిస్తారు.
లవ్ స్టోరీస్ సాధారణంగా రొటీన్ గానే ఉంటాయి. కానీ వాటికి భిన్నంగా 28°C మూవీ ఉంటుంది. ఒక డిఫరెంట్ ఎమోషనల్ సైకలాజికల్ థ్రిల్లింగ్ లవ్ స్టోరీ చూడాలంటే 28°C సినిమా మంచి ఆప్షన్.
రేటింగ్ 3/5