అకిరాపై రూమర్స్ వద్దు – రేణు దేశాయ్

పవర్ స్టార్ వారసుడు అకిరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ గురించి గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. రామ్ చరణ్ నిర్మాణంలో అకిరా సినిమా అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈమధ్య పవన్ కళ్యాణ్‌ తను ఎక్కడికి వెళితే అక్కడకి అకిరా నందన్ ను తీసుకెళ్లడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది. అయితే.. అకిరా ఎంట్రీ గురించి వార్తలు వచ్చిన ప్రతిసారీ రేణు దేశాయ్ క్లారిటీ ఇస్తూనే ఉంది.

ఇప్పుడు మరోసారి రేణు దేశాయ్ అకిరా ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చింది. అకిరా ఎంట్రీ గురించి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సినిమాల్లోకి రావాలా..? వద్దా అనేది అకిరా నిర్ణయానికే వదిలేస్తున్నామని తెలిపింది. అకిరా సినిమాల్లోకి రావాలి అనుకుంటే తానే సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని తెలియచేస్తాను అని పేర్కొంది. అంతవరకు రూమర్స్ ప్రచారం చేయవద్దని రేణుదేశాయ్ రిక్వెస్ట్ చేసింది.