రికార్డ్ ధరకు “పెద్ది” ఆడియో రైట్స్

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పెద్ద సినిమా ఆడియో రైట్స్ కు రికార్డ్ ధర పలికినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ లేబుల్ టీ సిరీస్ సొంతం చేసుకుంది. ఈ చిత్ర పాటల హక్కులను దాదాపు 35 కోట్ల రూపాయలకు టీ సిరీస్ దక్కించుకుందని టాక్ వినిపిస్తోంది.

స్టార్ హీరోల సినిమాల ఆడియో రైట్స్ కు మంచి ధర పలుకుతున్న నేపథ్యంలో పెద్దికి వచ్చిన ఆఫర్ రికార్డ్ ప్రైస్ అనే చెబుతున్నారు. ఈ సినిమా మీదుకున్న క్రేజ్ తో పాటు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తుండటం కూడా ఆడియో రైట్స్ కు డిమాండ్ పెంచింది. రీసెంట్ గా చరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఆట కూలీగా రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.