శృతి ప్లేస్ లో మృణాల్. అసలు నిజం ఇదేనట

అడవి శేష్ హీరోగా నటిస్తోన్న మూవీ డెకాయిట్. ఇందులో ముందుగా శృతి హాసన్ తీసుకున్నారు. ఈ మూవీ షూట్ లో శృతి జాయిన్ అయ్యింది. అయితే.. అనూహ్యంగా శృతి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.. దీంతో మృణాల్ ను తీసుకున్నారు. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఎందుకు శృతి తప్పుకుంది అనేది ఆసక్తిగా మారింది.

అడవి శేష్‌, శృతి కాంబోలో మూవీ అనగానే డెకాయిట్ పై క్రేజ్ పెరిగింది. గ్లింప్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఎప్పుడెప్పుడు ఈ మూవీ వస్తుందా అని వెయిట్ చేస్తుంటే.. హీరోయిన్ మార్చేశారనే విషయం బయటకు వచ్చింది. దీని వెనుక ఏం జరిగిందంటే.. ఆమె పాత్రతో పాటు, స‌హ‌న‌టుడి విష‌యంలో అమ్మ‌డు అసంతృప్తిగా ఉంద‌ట. ఆ కార‌ణంగానే ఎగ్జిట్ అయిందే పుకార్ తెర‌ పైకి వ‌చ్చింది. ఇందులో నిజ‌మెంతో తెలియ‌దుగానీ మీడియాలో జ‌రిగిన ప్ర‌చార‌మ‌ది. ఆతర్వాత తెలిసింది ఏంటంటే.. ఎక్కువ డేట్స్ అడగడం.. వర్కింగ్ టైమ్ కూడా ఎక్కువుగా ఉండడంతో నచ్చక శృతి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. శృతి హాస‌న్ స్థానంలో మృణాల్ ఠాకూర్ని ఎంపిక చేసారు. ప్ర‌స్తుతం మృణాల్ ఠాకూర్ షూటింగ్ లో పాల్గొంటుంది.

ఈ సినిమాకు అమ్మ‌డు అందుకుంటోన్న పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ సినిమాకు 3.5 కోట్ల‌కు పైగా చార్జ్ చేస్తోందట‌. ఈ పారితోషికం శృతి హాస‌న్ కంటే అధిక‌మ‌ని అంటున్నారు. శృతి హాస‌న్ కి రెండున్న‌ర కోట్లు మాత్ర‌మే ఆఫ‌ర్ చేయ‌గా అందుకు ఒప్పుకునే అంగీక‌రించింది. ఆయితే ఆమె త‌ప్పుకున్న త‌ర్వాత మృణాల్ కి మూడున్న‌ర కోట్లు ఇచ్చి తీసుకురావ‌డం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. అంత పారితోషికం మృణాల్ డిమాండ్ చేయ‌న‌ప్ప‌టికీ పాన్ ఇండియాలో ఆమె క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని మేక‌ర్స్ ఆఫ‌ర్ చేసారట‌. ఇక్క‌డ మ‌రో కార‌ణం కూడా వినిపిస్తుంది. శృతి హాస‌న్ త‌ప్పుకోవ‌డంతో? ఆమె మార్కెట్ ని బీట్ చేయాలి? అన్న కోణంలోనూ ముంబై బ్యూటీకి ఈ రేంజ్ లో ఆఫ‌ర్ చేసార‌నే రీజ‌న్ కూడా వినిపిస్తుంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో తెలియాలి.