సీమ బ్యాక్ డ్రాప్ లో మెగాస్టార్ మూవీ

మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ సంస్థ నిర్మించనుంది. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించిన బ్యాక్ డ్రాప్ రాయలసీమ నేపథ్యంతో ఉంటుందని తెలుస్తోంది. సీమ బ్యాక్ డ్రాప్ లో చిరంజీవి చేసిన ఇంద్ర సినిమా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. ఆ సూపర్ హిట్ ఫార్ములాను దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ తో తాను తీస్తున్న సినిమాలో ఉపయోగిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. స్క్రిప్ట్ ప్రకారం కథలో రాయలసీమ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పవర్ పుల్ గా డిజైన్ చేస్తున్నారట.

ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని. మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాంలో గోదారి గట్టు మీద అంటూ సూపర్ హిట్ సాంగ్ పాడిన రమణ గోగుల మెగాస్టార్ సినిమాలోనూ ఓ సాంగ్ పాడబోతున్నాడట. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు.