ఏజెంట్ డిజాస్టర్ అవ్వడంతో బాగా డీలాపడ్డాడు అఖిల్. చాలా కథలు విని ఒక కథను ఫైనల్ చేశాడు. ఆ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో చేయాలి. అనిల్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఓకే చెప్పాడు కానీ..యువి సంస్థ విశ్వంభర బిజీలో ఉండడం.. ఆ సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో అఖిల్ సినిమా ఆలస్యం అవుతోంది. యువి క్రియేషన్స్ లో చేయాల్సిన సినిమా ఆలస్యం అవుతుండడంతో మురళీకృష్ణ అబ్బూరు చెప్పిన కథకు ఓకే చెప్పి సైలెంట్ గా సెట్స్ పైకి తీసుకువచ్చాడు అఖిల్. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం.
ఈ సినిమాను మాస్ మహారాజా రవితేజ చేయాల్సిందట. ముందుగా డైరెక్టర్ మురళీ కృష్ణ అబ్బూరు ఈ కథను రవితేజకు చెప్పాడట. కథ విని సినిమా చేస్తానని చెప్పారట. అయితే.. రవితేజకు యాక్సిడెంట్ అవ్వడం అందువలన తను చేస్తోన్న సినిమాల ప్లానింగ్ మారింది. దీంతో మురళీకృష్ణ అబ్బూరుతో చేయాలి అనుకున్న సినిమా సెట్స్ పైకి రావడానికి బాగా ఆలస్యం అవుతుంది. ఇదే విసయం చెబితే.. మురళీ కృష్ణ అఖిల్ కు కథ చెప్పడం.. ఓకే అనడంతో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగిందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.