హీరో రవితేజ ప్రస్తుతం నటిస్తోన్న మూవీ మాస్ జాతర. ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. అదే డేట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు వస్తుండడంతో రవితేజ మూవీ వాయిదా పడింది. వీరమల్లు కంటే ముందే మాస్ జాతర డేట్ ప్రకటించారు. అయితే.. పవర్ స్టార్ తో పోటీ పడడం ఇష్టం లేక వేరే డేట్ చూస్తున్నారు. త్వరలోనే మాస్ జాతర రిలీజ్ డేట్ ప్రకటిస్తారు. మరోవైపు డైరెక్టర్ కిషోర్ తిరుమలతో రవితేజ సినిమా ఫిక్స్ అయ్యిందని..ఈ సినిమాని అనౌన్స్ చేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేశారని సమాచారం.
రేపు ఆదివారం శ్రీరామ నవమికి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయాలని ముహుర్తం ఫిక్స్ చేశారట. రవితేజ మాస్.. కిషోర్ తిరుమల క్లాస్.. మరి.. వీరిద్దరి కాంబో మూవీ అంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని స్టార్ట్ కాక ముందు నుంచే ఆసక్తి ఏర్పడింది. కిషోర్ తిరుమల ఫ్యామిలీ ఎమోషన్స్ ను బాగా డీల్ చేయగలడు అనే పేరు ఉంది. తన చిత్రాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఎమోషనల్ సీన్స్ బాగా తెరకెక్కించాడు. ఇప్పుడు రవితేజతో చేసే సినిమా కిషోర్ తిరుమల స్టైల్ లో ఉంటుందా లేక రవితేజ స్టైల్ లో ఉంటుందా అనేది ఆసక్తికరంగా