యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం లైలా సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 14న ఈ లైలా చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇటీవల విశ్వక్ నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో లైలా మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ లైలా మూవీ తర్వాత బందూక్ అనే ఓ చిత్రాన్ని పట్టాలెక్కించాల్సింది. దీనికి సుధాకర్ చెరుకూరి నిర్మాత. ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ జరిగిపోయాయి. అయితే.. అనివార్య కారణాలతో ఈ సినిమా నుంచి విశ్వక్ సేన్ తప్పుకొన్నాడని సమాచారం. ఈ కథ తనకు బాగుంటుందని ఒప్పుకున్నప్పటికీ.. క్యారెక్టర్ తనకు సెట్ కాదనే ఉద్దేశ్యంతో విశ్వక్ నో చెప్పాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
విశ్వక్ నో చెప్పిన తర్వాత ఈ కథ ఇప్పుడు రవితేజ దగ్గరకు వెళ్లిందట. రవితేజతో దర్శక నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నారని, వారం పది రోజుల్లో ఈ ప్రాజెక్టుపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. విచిత్రం ఏమిటంటే.. అసలు ఈ కథ రవితేజని దృష్టిలో ఉంచుకొని రాసిందట కానీ.. విశ్వక్ దగ్గరకు వెళ్లింది. ఇప్పుడు మళ్లీ రవితేజ దగ్గరకు వచ్చింది. రవితేజ మాస్ జాతర తుది మెరుగుల్లో వుంది. ఈ సినిమా తరవాత రవితేజ బందూక్ మూవీని పట్టాలెక్కించే అవకాశం ఉంది. రవితేజ తన రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతతో చర్చలు జరుగుతున్నాయి. అది ఓకే అయితే సినిమా కన్ఫర్మ్ అయినట్లే.