అందం, ప్రతిభతో ఇండియన్ సినిమా క్వీన్ గా ఎదిగింది రశ్మిక మందన్న. నాయికగా ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకుంది. రశ్మిక ఉంటే ఆ సినిమా హిట్ అనేంతగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఇండియన్ సినిమాకు లక్కీ మస్కట్ గా మారింది. ప్రతి సినిమాలో ఆమె నటన, ఆకర్షణ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. వెయ్యి కోట్ల రూపాయల సినిమాలో నటించాలనేది చాలా మంది హీరోయిన్స్ కు పెద్ద డ్రీమ్. దాదాపు అసాధ్యమైన ఈ ఫీట్ ను వరుస చిత్రాలతో అనేకసార్లు సొంతం చేసుకుని ఆశ్చర్యపరుస్తోంది రశ్మిక.
రశ్మిక నటించిన పుష్ప, పుష్ప 2, యానిమల్ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశాయి. తాజాగా ఛత్రపతి శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమాలో యేసుబాయి పాత్రలో రశ్మిక నటనకు అంతా ఫిదా అయ్యారు. ఛావా బాక్సాఫీస్ వద్ద 600 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించింది. ఈ సక్సెస్ లు కొనసాగిస్తూ ప్రస్తుతం తన క్రేజీ లైనప్ కంటిన్యూ చేస్తోంది రశ్మిక. సల్మాన్ ఖాన్ సరసన సికిందర్, నాగార్జున, ధనుష్ హీరోలుగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న కుబేర సినిమాలతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ లో నటిస్తోంది.