హారర్ మూవీలో రశ్మిక

స్టార్ హీరోయిన్ రశ్మిక(Rashmika mandanna) పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో తన స్టార్ డమ్ కొనసాగిస్తోంది. పాన్ ఇండియా మూవీస్ చేస్తూ ప్రేక్షకులకు చేరువవుతోంది. రీజనల్ హీరోయిన్స్ డ్రీమ్ గా భావించే బాలీవుడ్ లో ఇప్పటికే పలు హిట్ మూవీస్ చేసింది రశ్మిక..ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బాలీవుడ్ ప్రాజెక్ట్ లో రశ్మిక కనిపించనుంది.

వాంపైర్స్ ఆఫ్ విజయనగర(Vampire of vijayanagara) అనే పేరుతో దర్శకుడు ఆదిత్య ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సస్పెన్స్ హారర్ మూవీగా తెరకెక్కున్న వాంపైర్స్ ఆఫ్ విజయనగర సినిమాలో రాజ్ కుమార్ రావ్(Rajkumar rao) హీరోగా నటిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాను 14 శతాబ్దంలో జరిగే కథతో పీరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. రశ్మిక పుష్ప 2, ది గర్ల్ ఫ్రెండ్ మూవీతో పాటు మరికొన్ని క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది.