ధనుష్ సరసన రశ్మిక

ధనుష్ హీరోగా దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సినిమాకు నాయికగా రశ్మిక మందన్నను సెలెక్ట్ చేశారు. ఈ స్టార్ హీరోయిన్ ను సినిమాలోకి తీసుకున్నట్లు టీమ్ ఇవాళ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్నారు.

ధనుష్ నటిస్తున్న 51వ చిత్రమిది. ఇటీవల ఈ సినిమా నుంచి ధనుష్ పుట్టినరోజు సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సొసైటీలో ఆర్థిక అసమానతల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తరహా మంచి మెసేజ్ సినిమాలో ఉండనుంది.

ఈ సినిమా టీమ్ లో జాయిన్ అయిన సందర్భంగా రశ్మిక స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. ధనుష్ మూవీలో నటిస్తుండటంపై తన ఎగ్జైట్ మెంట్ తెలియజేసింది. ఈ ప్రాజెక్ట్ కు సెలెక్ట్ అవడం సంతోషంగా ఉందని రశ్మిక చెప్పింది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాలో నాగార్జున ఓ స్పెషల్ రోల్ చేస్తున్నట్లు సమాచారం.