తన స్టాఫ్ బాగోగులు చూసుకోవడంలో రశ్మికకు మంచి పేరుంది. టాలీవుడ్ లోకి రశ్మిక అడుగుపెట్టిన ఛలో నుంచి ఇప్పటిదాకా పర్సనల్ స్టాఫ్ కంటిన్యూ అవుతున్నారు. వాళ్ల ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా రశ్మిక వెళ్తుంటుంది. రీసెంట్ గా రష్మిక మందన్న తన మేకప్ అసిస్టిట్ సాయి బాబు పెళ్లికి పెద్దగా వెళ్లింది. నూతన వధూవరులకు ఆశీర్వాదాలు అందించింది.
రశ్మిక తమకు మేడమ్ కాబట్టి ఈ జంట ఆమెకు పాదాభివందనం చేశారు. కొత్త జంట చేసిన ఈ పనితో రశ్మిక షాక్ అయ్యింది. వెంటనే తేరుకుని వాళ్లకు బ్లెస్ చేసింది. రశ్మికకు ఈ వధూవరులు పాదాభివందనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక కెరీర్ పరంగా చూస్తే రశ్మిక ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ , డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2 లో నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది మార్చి 22న రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. రశ్మిక నటిస్తున్న బాలీవుడ్ మూవీ యానిమల్ డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ సినిమాను రణ్ బీర్ కపూర్ హీరోగా దర్శకుడు సందీప్ వంగా రూపొందిస్తున్నారు.