బాలీవుడ్ లో కెరీర్ బిల్డ్ చేసుకుందామనుకుంటున్న హీరోయిన్ శ్రీలీలకు టైమ్ కలిసిరావడం లేదు. ఆమె ఇప్పటికే ఆశిషీ 3 అనే హిందీ మూవీలో నటిస్తోంది. ఆశికీ సిరీస్ లో వస్తున్న మూడో చిత్రమిది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత పతీ పత్నీ ఔర్ వో సీక్వెల్ లోనూ శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు.
అయితే ఇప్పుడా మూవీ నుంచి శ్రీలీలను తప్పించి రాషా తడానీని తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మోడల్ రాషా తడానీ హీరోయిన్ రవీనాటాండన్ కూతురు. పతీ పత్నీ ఔర్ వో 2 చిత్రంలో రాషా తడానీ హీరోయిన్ గా కనిపించనుంది. మరోవైపు తెలుగులోనూ శ్రీలీలకు సక్సెస్ రావడం లేదు. ఆమె హీరోయిన్ గా నటించిన రీసెంట్ మూవీ రాబిన్ హుడ్ బాక్సాఫీస్ వద్ద నిరాశపర్చింది.