రేప్ కేసులో ఇరుక్కున్న జానీ మాస్టర్

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jonny master) రేపు కేసు(Rape case)లో ఇరుక్కున్నారు. జానీ మాస్టర్ తనను లైగింకంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళా కొరియోగ్రాఫర్ హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్ తీసుకున్న పోలీసులు రేపు కేసుతో పాటు దాడిచేయడం, బెదిరింపు వంటి కేసులు నమోదు చేశారు.

చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ చేస్తున్నప్పుడు, నార్సింగిలోని తన నివాసంలో కూడా జానీ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి విచారణ కోసం నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు. జానీ మాస్టర్ పై పలు ఐపీసీ సెక్షన్ ల ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇటీవలే జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఈ రేప్ కేసు జానీ మాస్టర్ జీవితంలో పెద్ద మచ్చగా మారనుంది.