రానా దగ్గుబాటి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే.. బాహుబలి ఆతర్వాత ఆ రేంజ్ సక్సెస్ సాధించలేదు. ఇప్పుడు మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ కాకపోయినా.. పాన్ ఇండియా సినిమాతో విజయం సాధించాలని తపిస్తున్నాడు. గతంలో రానా, తేజ కాంబినేషన్లో నేనే రాజు నేనే మంత్రి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ కాంబోలో మరో సినిమా రూపుదిద్దుకొంటోంది. అదే.. రాక్షస రాజు. గత కొన్ని రోజులుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే నెలలో సెట్స్ పైకి తీసుకురానున్నారు.
అయితే.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే… ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారట. చాప్టర్ 1, చాప్టర్ 2… రూపంలో ఈ సినిమా విడుదల కాబోతోందని తెలిసింది. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్.. ఇలా రెండు భాగాల ఫార్ములా బాగా వర్కవుట్ అయ్యింది. అందుకే ఈ సినిమానీ పార్ట్ 1, పార్ట్ 2లుగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. షూటింగ్ అయితే మాత్రం ఒకేసారి కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారట. అయితే.. పార్ట్ 1, పార్ట్ 2 కి ఎక్కువ గ్యాప్ వస్తుంది కానీ.. ఈ సినిమాను మాత్రం మూడు నెలల గ్యాప్ లోనే విడుదల చేయాలి అనేది ప్లాన్ అని సమాచారం.