ఇక్కడ క్రేజ్ పెంచేందుకు అక్కడ ఆట మొదలుపెట్టారు

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ టేకాఫ్ అయ్యాయి. యూఎస్ నుంచి ఈవెంట్స్ మొదలుపెట్టడం మరింత క్రేజ్ క్రియేట్ చేస్తోంది. ఇక్కడ హైప్ పెంచేందుకు అమెరికా నుంచి ప్రమోషన్స్ బిగిన్ చేశారు మూవీ టీమ్. అమెరికాలోని డల్లాస్ లో ఈ నెల 21న గ్రాండ్ ఈవెంట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం రామ్ చరణ్ అమెరికా బయలుదేరివెళ్లారు.

ఎయిర్ పోర్ట్ లో నడిచివెళ్తున్న రామ్ చరణ్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. డల్లాస్ అంటే తెలుగోళ్లకు అడ్డా. అందుకే అక్కడ గేమ్ ఛేంజర్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. జనవరి 10 గేమ్ ఛేంజర్ రిలీజ్ కాబట్టి మూడు వారాల టైమ్ కూడా లేదు. దాంతో ఓవర్సీస్ సహా పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.