శనివారం రాజమండ్రిలో జరిగిన గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విషాధం చోటు చేసుకుంది. ఈవెంట్ లో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళ్తున్న ఇద్దరు మెగా ఫ్యాన్స్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాకినాడకు చెందిన మణికంఠ, చరణ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన పవన్ కల్యాణ్, రామ్ చరణ్, దిల్ రాజు తమ సంతాపం తెలియజేశారు. మృతులకు పవన్ జనసేన తరుపున 5 లక్షల రూపాయలు, రామ్ చరణ్ తన తరపున 5 లక్షల రూపాయల సాయం ప్రకటించగా..నిర్మాత దిల్ రాజు తన వంతుగా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తున్న తెలిపారు.
రామ్ చరణ్ మాట్లాడుతూ – గేమ్ ఛేంజర్ ఈవెంట్ దగ్గరకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకున్నాం. బాబాయ్ పవన్ కల్యాణ్ కోరుకునేది కూడా అదే. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. అభిమానుల కుటుంబాలు ఎంత బాధ పడతాయో అర్థం చేసుకోగలను. నాకు అంతే బాధగా ఉంది. అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. అని చెప్పారు.