చరణ్ తో రామాయణం ప్లాన్ చేస్తున్నారా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్లో రామాయణం ఆధారంగా ఆదిపురుష్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ రామాయణం సరిగా లేదని విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం భారీగానే కలెక్షన్స్ వసూలు చేస్తుండడం విశేషం. ఇదిలా ఉంటే.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ తో రామాయణం ప్లాన్ చేస్తున్నారని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తాడు. ఆ లుక్ లో చూసిన ప్రేక్షకాభిమానులు చరణ్ రాముడుగా కరెక్ట్ గా సెట్ అవుతాడని అంటున్నారు.

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ను తెరకెక్కించనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఇందులో సీత పాత్రను ఫిదా బ్యూటీ సాయిపల్లవి పోషించనుందని టాక్. రాముడుగా చరణ్‌, సీతగా సాయిపల్లవి జంట పర్ ఫెక్ట్ అనేలా ఉంటుంది అంటున్నారు. ప్రచారంలో ఉన్నది వాస్తవమా..? కాదా..? అనేది తెలియదు కానీ.. ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ నిజమే అయితే.. చరణ్, సాయిపల్లవి రాముడు, సీతగా నటిస్తే.. మాత్రం సంచలనమే. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.