తండ్రి అయిన చరణ్‌, సంతోషంలో మెగాస్టార్.

రామ్ చరణ్‌, ఉపాసన దంపతులకు ఈరోజు పా పుట్టింది. గత కొంతకాలంగా పిల్లల కోసం ఎదురు చూస్తున్నారు. 2012 సంవత్సరంలో చరణ్‌, ఉపాసనలకు పెళ్లైంది. అంటే.. పెళ్లి చేసుకున్న 13 సంవత్సరాల తర్వాత చరణ్‌, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. చరణ్‌, ఉపాసల బిడ్డ కోసం కీరవాణి తనయుడు కాలభైరవ ప్రత్యేక బాణీ రూపొందించడం విశేషం. ఈ స్పెషల్ ట్యూన్ ను కాలభైరవ… రామ్ చరణ్, ఉపాసనలకు కానుకగా పంపించారు. ఊహించని గిఫ్ట్ తో చరణ్, ఉపాసన ముగ్ధులయ్యారు. బిడ్డకు స్వాగతం పలకబోతున్న ఆనందంలో ఉన్న తమకు ఈ మ్యూజికల్ గిఫ్ట్ మరింత ఆనందం కలిగించిందంటూ కాలభైరవకు కృతజ్ఞతలు తెలిపారు.

చిరంజీవి.. తనయుడు చరణ్‌ ఎప్పుడు తండ్రి అవుతాడా అని పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. అది ఈ రోజు నెరవేరడంతో చిరంజీవి ఆనందానికి అవధులు లేవని చెప్పచ్చు. మెగా ఫ్యామిలీలో సంబరాలు స్టార్ట్ అయ్యాయి. అయితే.. ఇప్పుడు బేబీ పుట్టిన తర్వాత అత్తమామలతో కలిసి ఉండాలి అనుకుంటున్నామని ఉపాసన ఇటీవల ఓ ఇంటర్ వ్యూలో చెప్పారు. తమ ఎదుగుదలలో గ్రాండ్ పేరెంట్స్ కీలక పాత్ర పోషించారని.. అందుచేత గ్రాండ్ పేరంట్స్ తో వుంటే వచ్చే ఆనందాన్ని తమ బిడ్డకు దూరం చేయాలి అనుకోవడం లేదన్నారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి చరణ్‌, ఉపాసన దంపతులకు సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.