రీసెంట్ గా తన 40వ పుట్టినరోజు జరుపుకున్నారు హీరో రామ్ చరణ్. ఈ సందర్భంగా తన మిత్రులకు, సన్నిహితులకు బహుమతులు పంపుతున్నారాయన. తనతో పెద్ది మూవీ రూపొందిస్తున్న దర్శకుడు బుచ్చిబాబుకు కూడా ఇలాగే గిఫ్ట్ పంపాడు. ఆ గిఫ్ట్ ప్యాక్ లో హనుమాన్ చాలీసా, శ్రీరామ్ అని రాసిన పాదుకలు, హనుమాన్ విగ్రహం ఉన్నాయి.
ఆంజనేయుడి శక్తి వల్లే తాను ఇంత హ్యాపీగా ఉన్నానని, ఆ శక్తి బుచ్చిబాబుకు కూడా దక్కాలని కోరుకుంటూ రామ్ చరణ్ ఈ బహుమతితో పాటు పంపిన లేఖలో పేర్కొన్నారు. తనపై ఇంత ప్రేమ చూపిస్తున్న రామ్ చరణ్ కు కృతజ్ఞతలు తెలిపారు బుచ్చిబాబు. తాను ఈ బహుమతి ఎప్పటికీ గుర్తుంచుకుంటానని చెప్పారు. ప్రస్తుతం వీరి కాంబోలో రూపొందుతున్న పెద్ది సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.