రామ్ చరణ్ “పెద్ది” గ్లింప్స్ కు రికార్డ్ వ్యూస్

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా పెద్ది గ్లింప్స్ రికార్డ్ వ్యూస్ సాధిస్తోంది. ఈ సినిమా నుంచి నిన్న శ్రీరామ నవమి రోజున ఫస్ట్ షాట్ పేరుతో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ 24 గంటల్లో 36.5 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. 21 గంటల్లో 30 మిలియన్స్ కు పైగా వ్యూస్ సాధించి దేవర (26 మిలియన్), పుష్ప 2 (20 మిలియన్) గ్లింప్స్ రికార్డ్ ను దాటేసింది పెద్ది. టాలీవుడ్ లో 24 గంటల్లో హయ్యెస్ట్ వ్యూస్ సాధించిన గ్లింప్స్ గా పెద్ది కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఆట కూలీగా రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో ఆయన లుక్, క్యారెక్టర్ పవర్ ఫుల్ మాస్ మేకోవర్ తో ఉండబోతున్నట్లు ఈ గ్లింప్స్ ద్వారా తెలిసింది. దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ ను సరికొత్తగా తెరపై ఆవిష్కరించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ది సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ కలిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 27న పెద్ది సినిమా థియేటర్స్ లోకి రానుంది.