ప్రజలకు మనం అండగా ఉన్నామని చెబుదాం – రామ్ చరణ్

ప్రకృతి విపత్తుల సమయంలో తెలుగు ప్రజలతో మనం కలిసే ఉన్నామని చెబుదామని, వారికి అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు హీరో రామ్ చరణ్(Ram charan). ఆయన తన వంతుగా వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయలు అనౌన్స్ చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాలకు 50 లక్షల రూపాయల చొప్పున రామ్ చరణ్ విరాళం ప్రకటించారు. ఇప్పటికే మెగాస్టార్ కోటి రూపాయలు ప్రకటించగా..రామ్ చరణ్ తన వంతుగా కోటి డొనేషన్ ఇచ్చారు. ఇలా తండ్రీ కొడుకులు కలిసి 2 కోట్ల విరాళం ఇచ్చినట్లయ్యింది. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్(CM relief fund) కు ఈ విరాళం అందించారు చిరంజీవి, రామ్ చరణ్.

ఈ సందర్భంగా రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ. ‘వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మనం తోడుగా, అండగా ఉన్నామంటూ చేయూత అందించాల్సిన సమయం ఇది. నా వంతు బాధ్యతగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు