ఈ గ్రేట్ డైరెక్టర్ తో రామ్ చరణ్ బాలీవుడ్ మూవీ

రామ్ చరణ్ జంజీర్ రీమేక్ ద్వారా బాలీవుడ్ లో నేరుగా అడుగుపెట్టారు. ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు. ఆర్ఆర్ఆర్ తో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా రామ్ చరణ్ ను బాలీవుడ్ లో ఫేమస్ చేసింది. ఈ గుర్తింపే రామ్ చరణ్ కు ఓ అరుదైన అవకాశాన్ని ఇవ్వనుందని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ లో గ్రేట్ డైరెక్టర్ గా పేరున్న రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఇటీవల ముంబై వెళ్లిన రామ్ చరణ్ రాజ్ కుమార్ హిరాణీని మీట్ అయ్యారని బాలీవుడ్ మీడియా వెల్లడిస్తోంది. ఇదొక మూవీ కోసమే అంటున్నారు. మున్నాభాయ్ ఎంబీబీఎస్, లగేరహో మున్నాభాయ్, త్రీ ఇడియట్స్, సంజూ, పీకే, వంటి ఆల్ టైమ్ హిట్ మూవీస్ చేశారు రాజ్ కుమార్ హిరాణీ. ఆయన ప్రస్తుతం షారుఖ్ తో డంకీ మూవీ రూపొందిస్తున్నారు.

రాజ్ కుమార్ హిరాణీ రూపొందించిన మున్నాభాయ్ తెలుగు రీమేక్ శంకర్ దాదాలో చిరంజీవి నటించారు. అలా చిరంజీవి, రామ్ చరణ్ గురించి రాజ్ కుమార్ హిరాణీకి తెలుసు. తన కొత్త కథలో రామ్ చరణ్ బాగుంటాడని హిరాణీ భావిస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ గురించి డంకీ రిలీజ్ తర్వాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.