హీరో రామ్ చరణ్, ఉపాసన కూతురు క్లింకార తాతయ్య చిరంజీవి ఇంటికి చేరుకుంది. ఆమె పుట్టి మూడు నెలలు అవుతోంది. ఇన్ని రోజులు ఉపాసన తల్లిదండ్రుల వద్ద ఉన్న క్లింకారను ఇవాళ చిరంజీవి ఇంటికి తీసుకొచ్చారు. వినాయక చవితి సందర్భంగా వేద పండితులు మంత్రాలు పఠిస్తూ ఉండగా ఆమెను ఇంటికి తీసుకొచ్చారు. చిన జీయర్ స్వామి ఆశ్రమంలోని వేద పండిత విద్యార్థులు క్లింకార రాకకు మంత్రోచ్ఛారణ చేశారు.
రామ్ చరణ్, ఉపాసన ఇరు కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్లింకారను చిరు ఇంటికి స్వాగతం పలికిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇవాళ వినాయక చవితి సందర్భంగా చిరంజీవి ఇంట్లో గణపతి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి కుటుంబ సభ్యులంతా ఈ పూజలో పాల్గొన్నారు.