స్టార్ హీరో రామ్ చరణ్ అయ్యప్ప మాలలో ఉన్నారు. ఆయన తన అయ్యప్ప మాల దీక్ష పూర్తికావడంతో దీక్షను ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో పూజలు చేసి విరమించారు. ఈ పూజతో అయ్యప్ప దీక్ష పూర్తి చేసుకున్నారు రామ్ చరణ్. ఆయనకు ఆయల అధికారులు, స్థానిక నాయకులు స్వాగతం పలికారు. దగ్గరుండి రామ్ చరణ్ తో పూజా కార్యక్రమాలు చేయించారు. రామ్ చరణ్ ముంబై సిద్ధి వినాయక ఆలయంలో పూజలు చేసిన ఫొటోస్ సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేస్తున్నారు.
ఒక యాడ్ షూట్ కోసం ముంబై వెళ్లిన రామ్ చరణ్…అక్కడి సిద్ధి వినాయక ఆలయంలో పూజలు నిర్వహించారు. తన కూతురు క్లింకార ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష చేపట్టారు. ఇటీవలే క్లింకార అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి రామ్ చరణ్ ఇంటికి చేరుకుంది.ఈ సందర్బాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు చిరంజీవి కుటుంబ సభ్యులు.