ఎనర్జిటిక్ హీరో రామ్ ఇటీవల డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో డబుల్ ఇస్మార్ట్ మూవీ స్టార్ట్ చేశాడు. ఇది ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్. లైగర్ తర్వాత నుంచి దాదాపు ఒక సంవత్సరం పాటు ఈ కథ పై వర్క్ చేశాడు పూరి. స్టోరీ బాగా రావడంతో రామ్ వెంటనే ఓకే చెప్పాడు. ఇటీవల సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైన డబుల్ ఇస్మార్ట్ ప్రస్తుతం ముంబాయిలో షూటింగ్ జరుపుకుంటుంది. రామ్ మరి కొంత మంది ఫైటర్స్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే.. బోయపాటితో చేస్తున్న స్కంద అప్ డేట్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది.
రామ్ తో ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను స్కంద అనే భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేస్తే.. ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇస్మార్ట్ శంకర్ తో వచ్చిన మాస్ ఇమేజ్ ను రెట్టింపు చేసేలా బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని… ఇందులో రామ్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా చాలా మాసీవ్ గా ఉంటుందని టీజర్ ను బట్టి తెలుస్తుంది. టీజర్ రిలీజ్ తర్వాత స్కంద నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. మరి.. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. స్కంద షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.
ఆగష్టు ఫస్ట్ వీక్ లో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారని సమాచారం. త్వరలోనే ఫస్ట్ సింగిల్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీని సెస్టెంబర్ 15న విడుదల చేయనున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్ర్కీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇక డబుల్ ఇస్మార్ట్ ను ఈ ఇయర్ ఎండింగ్ కి కంప్లీట్ చేసేలా ప్లాన్ చేశారట. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ టైమ్ తీసుకోవాలి అనుకుంటున్నారట. మార్చి 8న డబుల్ ఇస్మార్ట్ మూవీని విడుదల చేయనున్నారు. మరి.. స్కంద, డబుల్ ఇస్మార్ట్ ఈ రెండు చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి.