ఆకట్టుకుంటున్న “ఆపరేషన్ రావణ్” ట్రైలర్

రక్షిత్ అట్లూరి (Rakshit atluri) హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్” (Operation ravan). ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ (Sangeerthana vipin) హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆపరేషన్ రావణ్” సినిమా ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ వస్తోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

“ఆపరేషన్ రావణ్” ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – సిటీలో సీరియల్ కిల్లర్ వరుస మర్డర్స్ చేస్తుంటాడు. ఈ మర్డర్స్ చేసేప్పుడు ఆధారాలు దొరకకుండా మాస్కులు పెట్టుకుంటూ ఉంటాడు. ఈ సీరియల్ కిల్లర్ ఎవరనేది పట్టుకునేందుకు అటు మీడియా, ఇటు పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగుతుంది. ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, ఎందుకు వీళ్లందరినీ క్రూరంగా చంపుతున్నాడు అనేది ట్రైలర్ లో ఆసక్తిని కలిగించింది. హీరో రక్షిత్ అట్లూరి ఎమోషనల్ , యాక్షన్ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. ట్రైలర్ లో కనిపించిన భారీ యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ గా నిలుస్తున్నాయి. దర్శకుడు వెంకట సత్య మొదటి సినిమా అయినా ఎంతో మెచ్యూర్డ్ గా మావీని తెరకెక్కించినట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. హై క్వాలిటీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఆకర్షణగా నిలుస్తున్నాయి. “ఆపరేషన్ రావణ్” ట్రైలర్ ఒక ట్రూ సైకో థ్రిల్లర్ మూవీని చూడబోతున్న ఫీలింగ్ కలిగించింది.