సంక్రాంతి బరిలో రజనీ సినిమా

టాలీవుడ్ సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే విపరీతమైన పోటీ నెలకొని ఉండగా…ఇప్పుడు మరో డబ్బింగ్ సినిమా ఈ పోటీకి యాడ్ అయ్యింది. రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న లాల్ సలామ్ మూవీ కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తోంది. విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నారు.

సంక్రాంతి పండుగకు మహేశ్ బాబు గుంటూరు కారం, విజయ్ దేవరకొండ, పరశురామ్, దిల్ రాజు సినిమా, రవితేజ ఈగల్, తేజ సజ్జా హనుమాన్ వంటి సినిమాలు రిలీజ్ అవుతుండగా…వెంకటేష్ సైంధవ్ కూడా సంక్రాంతికి వచ్చేలా కనిపిస్తోంది. డిసెంబర్ 22న రిలీజ్ కావాల్సిన సైంధవ్..సలార్ రాకతో పోస్ట్ పోన్ అయ్యింది.

ఇంత రష్ ఇప్పటికే ఉండగా..లాల్ సలామ్ కూడా పండగకే రావడంతో మరింత పోటీ నెలకొననుంది. సంక్రాంతి, దసరా వంటి పండగల సీజన్స్ లో డబ్బింగ్ సినిమాలకు థియేటర్స్ ఇవ్వొద్దనే నిర్మాతల మండలి డెసిషన్ అమల్లోకి రావడం లేదు.