ఫేక్ ఎన్ కౌంటర్స్ గుట్టు విప్పే పోలీస్

రీసెంట్ గా జైలర్ తో కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించారు సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ . ఈ ఉత్సాహంలో ఆయన తన కొత్త సినిమాలతో భారీ లైనప్ చేసుకుంటున్నారు. రజనీ తన కొత్త సినిమా లో పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ సినిమాను తలైవర్ 170గా పిలుస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తుండగా…జై భీమ్ దర్శకుడు టీజీ జ్ఞనవేల్ రూపొందిస్తున్నారు. ఇవాళ్టి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. తలైవర్ 170 సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అమితాబ్ తో పాటు ఫహాద్ ఫాజిల్, రానా కీ రోల్స్ చేస్తున్నారు.

ఈ సినిమా ఫేక్ ఎన్ కౌంటర్స్ గుట్టు విప్పే ఇన్వెస్టిగేషన్ నేపథ్యంతో సాగనుందని తెలుస్తోంది. సోషల్ మెసేజ్ తో ఉన్న ఈ కథలో ఫేక్ ఎన్ కౌంటర్ ఇన్వెస్ట్ గేట్ చేసే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రజనీ కనిపిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ రితికా సింగ్, మంజూ వారియర్, దుశారా విజయన్ నటిస్తుండటం విశేషం.