నానితో రాజమౌళి సినిమా !

దర్శకుడు రాజమౌళి, నాని కాంబినేషన్ లో వచ్చిన ఈగ సినిమా సూపర్ హిట్టయ్యింది. ఈ సినిమాలో ఈగదే ప్రధాన పాత్ర అయినా, నాని ఫస్టాఫ్ లో కీ రోల్ ప్లే చేశాడు. ఈగ సినిమా నానికి పాన్ ఇండియా వైజ్ పేరు తీసుకొచ్చింది. టెక్నికల్ గా ఒక మంచి అటెంప్ట్ గా ఈగ సినిమాను చెప్పుకోవచ్చు.

ఈ సినిమా రిలీజై 11 ఏళ్లవుతోంది. ఆ తర్వాత రాజమౌళి, నాని కాంబోలో సినిమా రాలేదు. సినిమా చేయకున్నా వీరి మధ్య మంచి రిలేషన్ ఉంది. నాని కొత్త సినిమాలు చూసి రెస్పాండ్ అవుతుంటారు రాజమౌళి. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం నానితో ఓ సినిమా చేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారట.

ప్రస్తుతం ఆయన మహేశ్ హీరోగా ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటు నాని కూడా తన హాయ్ నాన్న సినిమాలో నటిస్తున్నారు. ఆయనకు మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. మహేశ్ సినిమా పూర్తయిన తర్వాత నానితో రాజమౌళి ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడని టాక్ వినిపిస్తోంది.